ఆలంపూర్ ఎమ్మెల్యే v.m. abraham:కాంగ్రెస్లో చేరిక
ఆలంపూర్ ఎమ్మెల్యే వి.ఎం. అబ్రహం భారత రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కని కారణంగా అబ్రహం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హైదరాబాద్:ఆలంపూర్ ఎమ్మెల్యే వి.ఎం. అబ్రహం శుక్రవారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆలంపూర్ నుండి వి.ఎం అబ్రహం పేరును తొలుత ప్రకటించి ఆ తర్వాత విజయుడిని భారత రాష్ట్ర సమితి బరిలోకి దించింది. దీంతో అబ్రహం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో వి.ఎం. అబ్రహం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఆలంపూర్ అసెంబ్లీ స్థానం నుండి తొలుత వి. ఎం. అబ్రహంకే భారత రాష్ట్ర సమితి టిక్కెట్టు కేటాయించింది. గతంలో ఇదే స్థానం నుండి చల్లా వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చల్లా వెంకట్రామిరెడ్డి భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఆలంపూర్ నియోజకవర్గంలో వెంకట్రామిరెడ్డికి పట్టుంది.
also read:ఆలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్ది విజయుడికి టెన్షన్: నామినేషన్ పెండింగ్ లో ఉంచాలని కాంగ్రెస్ డిమాండ్
అయితే వి. ఎం. అబ్రహం స్థానంలో విజయుడికి టిక్కెట్టు ఇవ్వాలని చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ నాయకత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చారు.అభ్యర్ధుల జాబితాలో అబ్రహం పేరున్నా ఆయనకు బీ ఫాం మాత్రం బీఆర్ఎస్ ఇవ్వలేదు. చివరి నిమిషంలో అబ్రహం స్థానంలో విజయుడికి బీఆర్ఎస్ బీ ఫాం దక్కింది. ఈ పరిణామంతో అబ్రహం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అబ్రహంతో కాంగ్రెస్ నాయకత్వం సంప్రదింపులు జరిపింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అబ్రహం సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సమక్షంలో అబ్రహం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
అబ్రహం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నుండి భారత రాష్ట్ర సమితిలో చేరారు. బీఆర్ఎస్ లో రెండు దఫాలు ఆలంపూర్ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ దఫా బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కని కారణంగా ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.