Asianet News TeluguAsianet News Telugu

ఆలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్ది విజయుడికి టెన్షన్: నామినేషన్ పెండింగ్ లో ఉంచాలని కాంగ్రెస్ డిమాండ్


ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధి విజయుడి నామినేషన్ పై కాంగ్రెస్ పార్టీ  అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈ విషయమై  రిటర్నింగ్ అధికారి వద్ద  ఆ పార్టీ  నేతలు  తమ వాదనలు విన్పిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ లేవనెత్తిన వాదనలను భారత రాష్ట్ర సమితి నేతలు తోసిపుచ్చుతున్నారు.

Congress Alampur Candidate Sampath kumar Demands to pending BRS Candidate  Vijayudu nomination in Alampur Assembly Segment lns
Author
First Published Nov 13, 2023, 2:24 PM IST


హైదరాబాద్:ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధి  విజయుడి నామినేషన్ పై  కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.  విజయుడి నామినేషన్ ను పెండింగ్ లో పెట్టాలని  కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.  

ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని  పుల్లూరులో  విజయుడు ఫీల్డ్ అసిస్టెంట్ గా  పనిచేశాడు. అయితే  విజయుడు తన ఉద్యోగానికి  రాజీనామా విషయంలో స్పష్టత లేదని  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి  సంపత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయుడు  తన ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయమై  స్పష్టత లేకుండానే నామినేషన్ దాఖలు చేశారని  కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీంతో  విజయుడి నామినేషన్ ను పెండింగ్ లో పెట్టాలని  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సంపత్ కుమార్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే  తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాతే విజయుడు  బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేసినట్టుగా  భారత రాష్ట్ర సమితి నేతలు చెబుతున్నారు.

ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే  వీఎం అబ్రహం పేరును తొలుత బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే  ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే  చల్లా వెంకట్రామిరెడ్డి  ఆబ్రహంను మార్చాలని భారత రాష్ట్ర సమితి నాయకత్వం వద్ద పట్టుబట్టారు.  దీంతో  చివరి నిమిషంలో  అబ్రహంను మార్చి  విజయుడికి  బీఆర్ఎస్ టిక్కెట్టును కేటాయించింది. ఆరు రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కల్వకుంట్ల తారకరామారావు విజయుడికి  బీ ఫాం అందించారు. అయితే  విజయుడు  ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయలేదని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది.

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా  నామినేషన్ల పరిశీలన సాగుతుంది. నామినేషన్ల పరిశీలన సమయంలో  కాంగ్రెస్ అభ్యర్ధి సంపత్ కుమార్  ఆలంపూర్ రిటర్నింగ్ అధికారి వద్ద  తమ అభ్యంతరాలను  లేవనెత్తారు.  విజయుడు  తన ఉద్యోగానికి రాజీనామా విషయమై స్పష్టత లేనందున  నామినేషన్ ను పెండింగ్ లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.కాంగ్రెస్ అభ్యర్ధి  సంపత్ కుమార్ వాదనను  బీఆర్ఎస్ నేతలు తోసిపుచ్చారు.  ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాతే  విజయుడు  నామినేషన్ దాఖలు చేసినట్టుగా  అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ వాదన నేపథ్యంలో  ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే  ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం  నుండి ఈ దఫా విజయం సాధించాలని సంపత్ కుమార్  ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఆయన ఈ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రాతినిథ్యం వహించారు.  కాంగ్రెస్ పార్టీలో  కీలక స్థానానికి ఎదిగిన సంపత్ కుమార్  మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios