Ration Cards: కేటీఆర్ సంచలన హామీ.. రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటన.. ఎప్పుడంటే?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రేషన్ కార్డులపై చల్లటి మాట చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది జనవరిలో కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
 

brs working president K tharaka rama rao announce new ration cards would be issued in january if brs forms govt kms

హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీపై కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ పెళ్లిళ్లు చేసుకుని పిల్లలు కన్న చాలా పేద కుటుంబాలకు ఇంకా రేషన్ కార్డును చూసుకునే భాగ్యం దక్కలేదు. అలాగే, చాలా ప్రభుత్వ సంక్షేమాలకు రేషన్ కార్డులను లంకె పెట్టారు. దీంతో పేద కుటుంబాలు అయినా.. రేషన్ కార్డులు లేక సంక్షేమ ఫలాలు కోల్పోవాల్సి వస్తున్నది. ప్రభుత్వం చెబుతున్నట్టుగా పేదవాళ్లే అయినా.. ఆయా సంక్షేమ పథకాలకు వంద శాతం పొందాల్సిన అవసరం, అర్హత ఉన్నవారే అయినప్పటికీ టెక్నికల్‌గా రేషన్ కార్డుల్లేక దేనికీ నోచుకోవడం లేదు. రేషన్ కార్డుల అంశాన్ని ప్రతిపక్షాలు చాలా సార్లు లేవనెత్తాయి. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశాయి. కానీ, ప్రభుత్వం నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ గురించి ఇది వరకు ప్రకటన రాలేదు. అంతేకాదు, రేషన్ కార్డు ఆధారిత హామీలనూ అధికార పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. రేషన్ కార్డులు ఉన్నవారికి రూ. 5 లక్షల బీమా, సన్న బియ్యం వంటి హామీలను పేర్కొంది. కానీ, కొత్త రేషన్ కార్డులను జారీ చేసే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. తాజాగా, మంత్రి కేటీఆర్ ఆ ప్రస్తావన చేశారు.

మంత్రి కేటీఆర్ ఆదివారం ఓ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే 2024 జనవరిలో కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రకటన చాలా మందిని ఆకర్షించింది. చివరిసారి 2021లో కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. అప్పటికే చాలా రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో చాలా తక్కువ రేషన్ కార్డులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.

Also Read: Hyderabad: హైదరాబాద్ పేరు మార్పుపై యోగి వర్సెస్ ఒవైసీ.. ఏమన్నారంటే?

ఈ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుందని చాలా మంది ఆశించారు. కానీ, అది జరగలేదు. ఇప్పటికీ కనీసం రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోలేని వారే లక్షల్లో ఉంటారని అంచనా.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios