తెలంగాణలో రైతులకు బ్యాడ్ న్యూస్.. నిధుల విడుదలకు అడ్డు చెప్పిన ఎలక్షన్ కమిషన్

తెలంగాణ రైతులకు రబీ సీజన్ కు సంబంధించిన రైతుబంధు (rythu bandhu) నిధుల విడుదలకు ఎన్నికల కమిషన్ అడ్డుకట్ట వేసింది. అలాగే ఉద్యోగుల డీఏ (DA of employees) కూడా విడుదల చేయకూడదని ప్రభుత్వానికి సూచించింది.

Bad news for farmers in Telangana. Election Commission has blocked the release of funds..ISR

తెలంగాణలో ఎన్నికలు (telangana elections 2023) సమీపిస్తున్నాయి. దాదాపు నెలన్నర రోజుల నుంచి రాష్ట్రంలో ప్రచారం హోరెత్తిస్తోంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పలు పథకాలకు నిధులు విడుదల కావడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు ఎంతో ఎదురుచూస్తున్న రైతుబంధు (rythu bandhu) నిధులు కూడా ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశం కనిపించడం లేదు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రైతు బంధు, రుణమాఫీ (runa mafi)  నిధులు విడుదల చేయకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

రోడ్లు బాగా లేవని వైసీపీని వద్దనుకోవద్దు.. రాజధాని వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి - మంత్రి ధర్మాన

అలాగే ఉద్యోగులకు డీఏ (DA of employees) కు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రుణ మాఫీ, డీఏ నిధులు విడుదల చేయాలని భావించింది. అయితే ఎన్నికల సమయం కావడంతో దీని కోసం ఎన్నికల కమిషన్ (election commission) అనుమతిని కోరింది. అయితే దానిని ఈసీ తిరస్కరించింది.

Chiranjeev Singh : తొలి సిక్కు ఆర్ఎస్ఎస్ ప్రచారక్ చిరంజీవ్ సింగ్ కన్నుమూత.. ఆయన జీవిత విశేషాలివే..

తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టబడి సాయంగా ప్రతీ సంవత్సరం రెండు విడతల్లో ఎకరానికి రూ.10 వేల చొప్పున అందిస్తూ వస్తోంది. ఇందులో ఖరీఫ్ సీజన్ (kharif season) లో రూ.5 వేలు, రబీ సీజన్ (rabi season) లో రూ.5 వేల చొప్పున ఇస్తోంది. రబీ సీజన్ నేపథ్యంలో వచ్చే నెలలో రైతు బంధు కింద నిధులు విడుదల చేయాలనికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాని కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అడ్డుకట్ట వేసింది. రైతు రుణమాఫీ కూడా ఆగిపోయిన సంగతి తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios