Chiranjeev Singh : తొలి సిక్కు ఆర్ఎస్ఎస్ ప్రచారక్ చిరంజీవ్ సింగ్ కన్నుమూత.. ఆయన జీవిత విశేషాలివే..
Chiranjeev Singh : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తొలి సిక్కు ప్రచారక్ చిరంజీవ్ సింగ్ చనిపోయారు. అనారోగ్య కారణాలతో ఆయన లూధియానాలోని ఓ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ నివాళి అర్పించారు.
Chiranjeev Singh : తొలి సిక్కు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్ చిరంజీవ్ సింగ్ సోమవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లూధియానాలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన 1953 నుండి ప్రచారక్ గా ఉన్నారు.1985లో ప్రారంభమైన రాష్ట్రీయ సిక్కు సంఘత్ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. 1990లో రెండో అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. చిరంజీవి సింగ్ మరణం పట్ల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు నివాళి అర్పించారు. మొత్తం దేశంలో ఐక్యత, సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
‘‘ఆర్ఎస్ఎస్ కు జీవితకాల ప్రచారక్ గా పనిచేసిన సర్దార్ చిరంజీవ్ సింగ్ పంజాబ్ లో దశాబ్దాల పాటు పనిచేశారు. తదనంతరం రాష్ట్రీయ సిక్కు సంఘం కృషి ద్వారా పంజాబ్ లో దురదృష్టకర పరిస్థితి కారణంగా తలెత్తిన పరస్పర విభేదాలు, అపనమ్మకాలను తొలగించి, జాతీయ స్ఫూర్తి, అవగాహన వెలుగులో యావత్ దేశంలో ఐక్యత, సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అపారమైన కృషి, పంజాబు గురు సంప్రదాయంపై లోతైన అధ్యయనం, అద్భుతమైన సంస్థాగత నైపుణ్యాల కారణంగా ఆయన జాతీయవాద ప్రవాహంలో అసంఖ్యాక వ్యక్తులను చేర్చారు. సర్దార్ చిరంజీవి ఆప్యాయత, మధురమైన వ్యక్తిత్వం అందరినీ మెప్పించింది. అనారోగ్యం కారణంగా కొంతకాలం క్రియాశీలకంగా లేనప్పటికీ, అతని అభిరుచి తగ్గలేదు’’ అని ఆర్ఎస్ఎస్ ఎక్స్ లో పోస్టు చేసింది.
1952లో పాటియాలాలోని రాజ్కియా విద్యాలయంలో బీఏ పూర్తి చేసిన ఆయన.. మొదట్లో ఉపాధ్యాయుడిగా మారాలని భావించాంరు. అయితే విభాగ్ ప్రచారక్ ఒత్తిడి మేరకు 1953లో ఆర్ఎస్ఎస్ లో ప్రచారక్ గా చేరారు. 2015 డిసెంబర్ 21న ఢిల్లీలోని మావలంకర్ ఆడిటోరియంలో 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని మోహన్ భగవత్ సింగ్ ఆయనను సన్మానించి, దాదాపు రూ.85 లక్షలు అందజేశారు. అయితే చిరంజీవి సింగ్ వెంటనే ఆ మొత్తాన్ని కేశవ్ సమరక్ సమితికి విరాళంగా ఇచ్చారు.
రాష్ట్రీయ సిక్కు సంఘం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి అవతార్ సింగ్ శాస్త్రి ప్రకారం.. ఖల్సా స్థాపించి 300 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1999 లో గురు గోవింద్ సింగ్ జన్మస్థలమైన పాట్నా సాహిబ్ నుండి ఆనంద్ పూర్ సాహిబ్ వరకు చిరంజీవి సింగ్ సంత్ యాత్రను నిర్వహించారు. 80వ దశకంలో రాష్ట్రంలో తీవ్రవాదం ఉన్న సమయంలో పంజాబ్ కల్యాణ్ ఫోరమ్ ను ఏర్పాటు చేసిన చిరంజీవి హరిద్వార్ నుంచి అమృత్ సర్ వరకు 'బ్రహ్మకుండ్ టు అమృత్ కుండ్' అనే ఊరేగింపును నిర్వహించి ఐక్యత, మత సామరస్యం కోసం కృషి చేశారు. 1948 లో ఆర్ఎస్ఎస్ నిషేధించనప్పటికీ.. చిరంజీవి సింగ్ సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొన్నారు. రెండు నెలల పాటు జైలు జీవితం గడిపారు.