Hyderabad: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రేపు, ఎల్లుండి స్కూళ్లు, కాలేజీలకు సెలవు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ నగరంలో అన్ని విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. నవంబర్ 29వ, 30వ తేదీల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్ అని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన అంటే ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉపాధ్యాయులు చాలా వరకు ఎన్నికల డ్యూటీలో ఉన్నారు. రాష్ట్రమంతా హడావుడిలో ఉండనున్నాయి. ఈ తరుణంలో హైదరాబాద్ కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29, 30వ తేదీల్లో నగరంలోని విద్యా సంస్థలు అన్నింటికి సెలవు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో రేపు, ఎల్లుండి విద్యా సంస్థలు మూసే ఉండనున్నాయి.
Also Read : Ration Cards: మంత్రి కేటీఆర్ సంచలన హామీ.. రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటన.. ఎప్పుడంటే ?
ఈ విషయాన్ని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోషల్ మీడియా ఎక్స్‌లో మంగళవారం పోస్టు చేశారు. ‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు (Schools, Colleges) నవంబర్ 29వ, 30వ తేదీల్లో మూసి ఉంటాయి. మళ్లీ డిసెంబర్ 1వ తేదీ నుంచి యధావిధిగా కార్యకలాపాలు కొనసాగుతాయి’ అని ట్వీట్ చేశారు. తెలంగాణ చీఫ్ సెక్రెటరీ, తెలంగాణ ఎన్నికల అధికారి ఖాతాలను ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు.