హైదరాబాద్: 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కనీస ఆదాయం అందించేలా చారిత్రాత్మక విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రతీ పేదవాడికి కనీసం ఆదాయం తప్పని సరి చేస్తామని చెప్పుకొచ్చారు. 

శంషాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ  ప్రతీ పేదవాడికి అండగా ఉండేలా ఈ కనీస ఆదాయ పరిమితి చట్టాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చారు. దేశంలో ఉండే ప్రతీ పేదవాడికి ఈ కనీస ఆదాయ పరిమితి విధానం వర్తించేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

దేశంలో పేదవాడు బతికేందుకు అవసరమైన సొమ్ముకంటే ఎక్కువే అందిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అంతకంటే తక్కువ ఇవ్వమన్నారు. దేశంలో ప్రతీ పేదవాడు బతికేందుకు వీలుగా ఒక ఆదాయ పరిమితిని ప్రకటించి దాన్ని అమలు చేస్తామని తెలిపారు. 

ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా పేదలంతా సమానమేనన్న భావన తీసుకువస్తానని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రతీ పేదవాడి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చేలా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కనీస ఆదాయపరిమితి నుంచి ఏ ఒక్కరిని విస్మరించనన్నారు. 

తాను మరొక్కసారి వాగ్ధానం చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో కనీస ఆదాయ పరిమితి చట్టాన్ని తీసుకువస్తానని భరోసా ఇచ్చారు. భారతదేశంలో పేదవారు ఎక్కడ ఉన్నా వారిని వెతికి వెతికి కనీస ఆదాయం పరిమితి వర్తించేలా చేస్తామని తెలిపారు. 

ప్రధాని నరేంద్రమోదీ నీరవ్ మోడీ జేబులో డబ్బులు వేస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తోందని తెలిపారు. అంతేకాదు నీరవ్ మోదీని పట్టుకుని ఆ సొమ్మును కూడాప్రజలకే పంచిపెడతామని తెలిపారు. 

ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో రైతు రుణామాఫీ పథకంపై హామీ ఇచ్చామని పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రుణమాఫీ చేస్తామని మామీ ఇచ్చామని తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన రెండురోజుల్లోనే రుణమాఫీ చేసి రైతుల పక్షాన నిలిచామన్నారు. అలాగే రైతులు పండించే వరికి కనీస మద్దతు ధర రూ.2500 ఇస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

మోదీ చేతిలో కేసీఆర్ అవినీతి చిట్టా, అందుకే రిమోట్ అయ్యారు: రాహుల్ గాంధీ