హైదరాబాద్: టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ మంత్రి హరీష్‌రావుకు ఆ పార్టీ చోటు కల్పించింది. ఎంపీ సంతోష్ స్థానంలో హరీష్‌రావుకు  టీఆర్ఎస్ ఈ స్థానం కల్పించింది. ఈసీకి టీఆర్ఎస్‌ తొలుత ఇచ్చిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో హరీష్ రావు పేరు లేదు. అయితే ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీంతో సోమవారం నాటికి హరీష్ రావు పేరును స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు.

టీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సమర్పించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో హరీష్ రావు పేరు లేదు.  స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్‌, కేటీఆర్‌తోపాటు.. మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, సీహెచ్‌.మల్లారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్‌, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, వి.ప్రశాంత్‌రెడ్డి, టి.శ్రీనివా‌సయాదవ్‌, కె.కేశవరావు, జె.సంతోష్ కుమార్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, ఆర్‌.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, బండ ప్రకాశ్‌, టి.రవీందర్‌రావు పేర్లు ఉన్నాయి.

ఈ జాబితా విషయమై మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో సోమవారం సాయంత్రానికి టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో హరీష్ రావు పేరును చేర్చించింది. ఎంపీ సంతోష్ కుమార్ పేరు స్థానంలో మాజీ మంత్రి హరీష్ రావుకు స్థానం కల్పించింది. ఈ మేరకు టీఆర్ఎస్ నేతలు ఈసీకి సోమవారం నాడు లేఖను రాశారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 25 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమిలో హరీష్ రావు  తీవ్రంగా కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకమైన అభ్యర్థుల ఓటమిలో హరీష్ మంత్రాంగం ఉంది. హరీష్‌కు ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రత్యేకమైన హెలికాప్టర్ కేటాయించారు. ఈ హెలికాప్టర్ ద్వారా ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రేవంత్ రెడ్డి, డీకే అరుణ లాంటి నేతలను ఓడించడంలో హరీష్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
 

సంబంధిత వార్తలు

హరీష్ రావుకు కేసీఆర్ షాక్: ఇంచార్జీల జాబితాలో లేని పేరు