హైదరాబాద్: తన మేనల్లుడు, సిద్ధిపేట శాసనసభ్యుడు టి. హరీష్ రావుకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు మరో షాక్ ఇచ్చారు. లోకసభ ఎన్నికల బాధ్యతల నుంచి ఆయనను పూర్తిగా దూరం పెట్టారు. 

లోకసభ ఎన్నికల ఇంచార్జీలను కేసీఆర్ ఖరారు చేసి, జాబితాను పార్టీలో అంతర్గత పంపిణీ చేశారు. అయితే, ఆ జాబితాను మీడియాకు విడుదల చేయలేదు. ఇంచార్జీల జాబితాలో హరీష్ రావు పేరు లేదు. ప్రతి ఎన్నికలోనూ బాధ్యతలు చేపట్టి నిర్వహించిన హరీష్ రావును కేసీఆర్ పూర్తిగా దూరం పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
మెదక్ లోకసభ స్థానం ఇంచార్జీ బాధ్యతలను కూడా హరీష్ రావుకు అప్పగించలేదు. ఈ బాధ్యతను కేసీఆర్ స్వయంగా తానే తీసుకున్నారు. 

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మూడు లోకసభ స్థానాలకు ఇంచార్జీగా వ్యవహరించనున్నారు. ఆ స్థానాలు... మెదక్, జహీరాబాద్, ఖమ్మం. మంత్రులకే కాకుండా కొందరు ముఖ్యమైన నేతలకు లోకసబ నియోజకవర్గాల బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. 

మేదక్ ఇంచార్జీగా నరేంద్రనాథ్ నియమితులయ్యారు. జహీరాబాద్ బాధ్యతలను భరత్ కుమార్ కు అప్పగించారు. సాధారణంగా మెదక్ బాధ్యతలను హరీష్ రావు నిర్వహిస్తూ ఉండేవారు. ఇప్పుడు అది లేకుండా పోయింది.