హైదరాబాద్: బీజేపీ అధిష్టానం ఆపరేషన్ ఆకర్ష్ కు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ విలవిలలాడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ పార్టీ వీడటంతో ఆందోళనలో ఉన్న కాంగ్రెస్ కు మరోషాక్ ఇచ్చేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. 

కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. దాదాపుగా ఐదుగురు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, కేంద్రమాజీమంత్రి సర్వే సత్యనారాయణకు గాలం వేస్తోంది. 

బీజేపీలోకి రావాలంటూ ఒత్తిడి తెస్తోంది. పార్టీలోకి వస్తే అత్యంత ప్రాధాన్యత ఇస్తామని రాజ్యసభ సీట్లు ఇస్తామని ఆశచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే సర్వే సత్యనారాయణ మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ అడుతున్నట్లు తెలుస్తోంది. 

అయితే బీజేపీ అధిష్టానం మాత్రం వరంగల్ నుంచి పోటీ చెయ్యాలని సూచిస్తోంది. దీంతో సర్వే సత్యనారాయణ బీజేపీలోకి వెళ్లాలా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలా అన్న అంశంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

బీజేపీ నేతల మంతనాలు: సునీత లక్ష్మారెడ్డి ఊగిసలాట

రేణుకా చౌదరి , పొంగులేటిలకు బీజేపీ గాలం

రాహుల్ ఫోన్ ఎఫెక్ట్: కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన జానా

బలమైన నేతలను బలహీనపర్చారు: కాంగ్రెస్‌పై డీకే అరుణ
'ఉత్త'ర కుమారుడే: రెక్కలు తెగిన పక్షిలా కాంగ్రెస్ విలవిల

కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ: కేసీఆర్‌తో భేటీ, కారెక్కనున్న మరో ఎమ్మెల్యే