హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్‌ మీద షాక్ తగులుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి బుధవారం నాడు కేసీఆర్‌తో భేటీ అయ్యారు.
 
బుధవారం నాడు ఉదయం ప్రగతి భవన్‌లో కొల్లాపూర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో నాలుగు గంటలుగా చర్చలు జరుపుతున్నారు. హర్షవర్ధన్ రెడ్డి కూడ టీఆర్ఎస్‌లో చేరనున్నారని ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియానాయక్, వనమా వెంకటేశ్వర రావు, సుధీర్ రెడ్డి,  కందాళ ఉపేందర్ రెడ్డిలు టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి  కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యత  సంతరించుకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హర్షవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై విజయం సాధించారు.


సంబంధిత వార్తలు

రేణుకా చౌదరి , పొంగులేటిలకు బీజేపీ గాలం

రాహుల్ ఫోన్ ఎఫెక్ట్: కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన జానా

బలమైన నేతలను బలహీనపర్చారు: కాంగ్రెస్‌పై డీకే అరుణ
'ఉత్త'ర కుమారుడే: రెక్కలు తెగిన పక్షిలా కాంగ్రెస్ విలవిల

కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ: కేసీఆర్‌తో భేటీ, కారెక్కనున్న మరో ఎమ్మెల్యే