భారతదేశంలో వొడాఫోన్ ఇప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. కొత్త ప్లాన్ లలో రూ.129, రూ. 269. ఆన్లిమిటెడ్ కాలింగ్ ఇంకా  డేటా ప్రయోజనాలను పక్కన పెడితే, మూడు కొత్త వోడాఫోన్ రీఛార్జ్ ప్లాన్‌ ధరలు రూ.129, రూ.199, రూ.269 తో ​​వోడాఫోన్ ప్లే మరియు జీ5 సబ్స్క్రిప్షన్ కూడా ఆఫర్ గా అందిస్తుంది.

దీనికి  అదనంగా వోడాఫోన్ కొత్త రూ. 24 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 100 నిమిషాల ఆన్-నెట్ కాల్‌లను అందిస్తుంది. ఇతర లోకల్/ నేషనల్ కాల్‌లు సెకనుకు 2.5 పైసలు వసూలు చేయనుంది. 

also read పోర్న్‌హబ్ సైట్ ఎంతమంది చూస్తున్నారో తెలుసా... తాజా రిపోర్ట్


వొడాఫోన్ రూ. 269 ​​రీఛార్జ్ ప్లాన్
​​వోడాఫోన్ రూ. 269 ప్రీపెయిడ్ ప్యాక్ ఎటువంటి FUP, 4GB డేటా లేకుండా ఆన్లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 56 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఇంకా 600 ఎస్‌ఎం‌ఎస్ లు కూడా అందిస్తుంది. ఇతర ప్రయోజనాలు వోడాఫోన్ ప్లే ఇంకా జీ5 యాప్స్ కి యాక్సెస్ చేస్తుంది.

వొడాఫోన్ రూ. 199 రీఛార్జ్ ప్లాన్
కొత్త వోడాఫోన్ రూ. 199 ప్లాన్ 21 రోజుల వాలిడిటీతో ఆన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు 1GB డేటా అలవెన్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లను అందిస్తుంది. ఇక వినియోగదారులకు వోడాఫోన్ ప్లే మరియు జీ5 సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.

also read ఎల్‌జి నుంచి డబల్ స్క్రీన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్...ధర ఎంతో తెలుసా ?


వొడాఫోన్ రూ. 129 రీఛార్జ్ ప్లాన్
వొడాఫోన్ రూ. 129 ప్రీపెయిడ్ ప్లాన్ ఏ FUP లేకుండా ఏ నెట్‌వర్క్‌ అయిన ఆన్లిమిటెడ్ కాల్స్, 2GB డేటాతో పాటు మొత్తం 300 ఎస్‌ఎం‌ఎస్  వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 14 రోజుల వాలిడిటీ ఉంటుంది. వోడాఫోన్ ప్లే మరియు జీ5 యాప్స్ పై ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తుంది.


వొడాఫోన్ రూ. 24 ప్లాన్
వోడాఫోన్ కొత్త రూ.24  ప్రీపెయిడ్ ప్లాన్ 100 నిమిషాల ఆన్-నైట్ నైట్ కాలింగ్ నిమిషాలను మాత్రమే అందిస్తుంది. 14 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఆన్-నెట్ కాలింగ్  రాత్రి 11 నుండి ఉదయం 6 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. ఇతర లోకల్ / నేషనల్ కాల్ చేయాలనుకుంటే సెకనుకు 2.5 పైసలు చార్జ్ చేస్తారు.