పోర్న్‌హబ్ సైట్ ఎంతమంది చూస్తున్నారో తెలుసా... తాజా రిపోర్ట్
పోర్న్‌హబ్ 2019 సంవత్సరానికి రివ్యూ గణాంకాలను విడుదల చేసింది. అయితే మే నెల నుండి గూగుల్ విడుదల చేయని గణాంకాలు ఇందులో ఉన్నాయి.ఆండ్రాయిడ్ యుసర్స్ గణాంకాలను గూగుల్ ప్రతి నెల ఈ లెక్కలను తెలిపేది, కానీ ఇప్పుడు ఇదీ కొంతకాలంగా నిలిపివేసింది.
ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన అడల్ట్ ఎంటర్టైన్మెంట్ సైట్లలో ఒకటైన పోర్న్‌హబ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పోర్న్‌హబ్ సైట్ యుసెర్స్ లెక్కలను విడుదల చేసింది. పోర్న్‌హబ్ సైట్‌ను సందర్శించే వారి నుండి ఈ డాటా లెక్కలను సేకరించింది. ఆండ్రాయిడ్ యుసర్స్ గణాంకాలను గూగుల్ ప్రతి నెల ఈ లెక్కలను తెలిపేది, కానీ ఇప్పుడు ఇదీ కొంతకాలంగా నిలిపివేసింది.
also read బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్...5 జిబి డేటాతో వాయిస్ కాలింగ్
2019 లో పోర్న్‌హబ్ వెబ్‌సైట్‌లో ఆండ్రాయిడ్ ట్రాఫిక్‌లో 48 శాతం పైగా (గత సంవత్సరం గూగుల్ నుండి వచ్చిన ప్రధాన అప్ డేట్), ఓరియో (2017 అప్ డేట్) నుండి 23 శాతం, నౌగాట్ (2016 అప్ డేట్) నుండి 12 శాతం వచ్చాయి.కొత్తగా విడుదలైన ఆండ్రాయిడ్ 10 (క్యూ) పోర్న్‌హబ్ అడల్ట్ ఎంటర్టైన్మెంట్ సైట్ 2019 సంవత్సరంలో 2 శాతం ట్రాఫిక్‌ను సూచిస్తుంది, ఈ డేటాను ఓ పత్రిక నివేదించింది.
"ఈ డేటా చాలా ఆసక్తికరంగా ఉందని, ఎందుకంటే మే నుండి ఆండ్రాయిడ్ ప్రతి వెర్షన్‌లో ఎన్ని డివైజెస్ ఉన్నాయో దాని డాష్‌బోర్డ్‌ను గూగుల్ అప్‌డేట్ చేయలేదు. కానీ కొన్ని నెలల తరబడి ఆండ్రాయిడ్ ఓఎస్ ప్రస్తుత స్థితి గురించి గణాంకాలు మా దగ్గర ఏవీ లేవు," అని ఒక నివేదికలో బుధవారం చెప్పారు.
గూగుల్ ఆండ్రాయిడ్ డిస్ట్రిబ్యూషన్ డాష్‌బోర్డ్ ఆండ్రాయిడ్ ప్రతి వెర్షన్‌లో ఎన్ని డివైజెస్ నడుపుతుందో ట్రాక్ చేస్తుంది. అయితే, ఈ సంవత్సరం మే నుండి ఇది కొత్త గణాంకాలను ఇప్పటివరకు వెల్లడించలేదు. పోర్న్‌హబ్ డేటా ఆండ్రాయిడ్ ప్రతి వెర్షన్ నుండి ఎంత ట్రాఫిక్ వచ్చిందో మాత్రమే తెలియజేస్తుంది.
సైట్ విజిటర్స్ పరంగా ఇది ప్రపంచంలోని 50 అతిపెద్ద సైట్లలో ఒకటి కాబట్టి, అలెక్సా ర్యాంకింగ్స్ ప్రకారం ఇది జనరల్ డిస్ట్రిబ్యూషన్ గణాంకాలను అందిస్తుంది.2018 కోసం పోర్న్‌హబ్ గణాంకాలతో పోల్చి చూస్తే, ఆండ్రాయిడ్ పై, ఆండ్రాయిడ్ ఓరియో కంటే ఎక్కువ ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే, iOS యుసెర్స్ పెరిగాక ఆండ్రాయిడ్ వాడకం తగ్గింది.
also read ఆన్ లైన్ లో చైనా కొత్త స్మార్ట్ ఫోన్... ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే
పోర్న్‌హబ్ బ్రౌజింగ్ కోసం iOSను ఎక్కువగా ఉపయోగించే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా నిలిచింది. తాజా iOS 13 వెర్షన్ 71 శాతం ఉపయోగించబడింది.మొత్తం మీద 2019లో మొత్తం మొబైల్ ట్రాఫిక్‌లో ఐఓఎస్ 52.8 శాతం ఉండగా, ఈ ఏడాది ఆండ్రాయిడ్ 46.6 శాతం పోర్న్‌హబ్ సైట్ ట్రాఫిక్ కలిగి ఉంది అని అడల్ట్ స్ట్రీమింగ్ సర్విస్ వెల్లడించింది. పోర్న్‌హబ్ వార్షిక 'ఇయర్ ఇన్ రివ్యూ' జాబితాలో భాగంగా ఈ డేటా విడుదల చేశారు.