ఎల్‌జి నుంచి డబల్ స్క్రీన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్...ధర ఎంతో తెలుసా ?

మడత స్మార్ట్ ఫోన్లకు పోటీగా దక్షిణ కొరియా మేజర్ ఎల్జీ డ్యూయల్ స్ర్కీన్ స్మార్ట్ ఫోన్ ఎల్జీ జీ 8ఎక్స్ థింక్ క్యూను ఆవిష్కరించింది. దీన్ని మినీ ట్యాబ్లెట్ గా కూడా వాడుకోవచ్చు. శనివారం నుంచి అన్ని రిటైల్ ఔట్‌లెట్లలో లభిస్తుంది. దీని ధర రూ.49,999గా నిర్ణయించింది ఎల్జీ. 

LG G8X ThinQ With Detachable Dual Screen  Launched in India

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం 'ఎల్​జీ' భారత మార్కెట్లో 'జీ' సిరీస్​లో మరో ప్రీమియం స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించింది. మడత ఫోన్లను దీటుగా ఎదుర్కొనేందుకు రెండు స్క్రీన్ల స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. ఎల్‌జీ నుంచి డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. ‘ఎల్‌జీ జీ8ఎక్స్ థింక్’ పేరుతో డిటాచబుల్ డ్యూయల్ స్క్రీన్ మొబైల్‌ను భారత విపణిలోకి విడుదల చేసింది. ఇందులో 2.1 అంగుళాల సెకండరీ కవర్ డిస్‌ప్లే కూడా ఉంది. ఈ డిస్‌ప్లే ద్వారా నోటిఫికేషన్లు, తేదీ, సమయం, బ్యాటరీ లైఫ్ వంటి వాటిని చూసుకోవచ్చు. 

also read   పోర్న్‌హబ్ సైట్ ఎంతమంది చూస్తున్నారో తెలుసా... తాజా రిపోర్ట్

డిటాచబుల్ డిస్‌ప్లేను యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ద్వారా ఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. దీనిని అవసరానికనుగుణంగా అన్ని కోణాల్లోనూ తిప్పుకోవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే మినీ ల్యాప్‌టాప్‌లా ఉపయోగించుకోవచ్చు. ఎల్‌జీ జీ8ఎక్స్ థింక్ స్మార్ట్ ఫోన్ ధర భారత్‌లో రూ.49,999 మాత్రమే. ఈ నెల 21 నుంచి దేశంలోని అన్ని రిటైల్ ఔట్‌లెట్లలో కొనుగోలు చేసుకోవచ్చు.

LG G8X ThinQ With Detachable Dual Screen  Launched in India
 
ఎల్‌జీ జీ8ఎక్స్ థింక్  స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ 9పై ఓఎస్, 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఫుల్ విజన్ డిస్‌ప్లే, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్, వాటర్ డ్రాప్ నాచ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ఎస్ఓసీ, 6జీబీ ర్యామ్, 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 2టీబీ వరకు జీబీని ఇంటర్నల్ స్టోరేజీ పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి.

also read కొత్త సోలార్ పవర్ హెడ్‌ఫోన్స్...ఒక్కసారి చార్జ్ చేస్తే 3 రోజులవరకు..
 
ఈ ఫోన్‌లో 12 ఎంపీ+13 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉన్నాయి. ఇక, డ్యూయల్ స్క్రీన్‌లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ ఫుల్ విజన్ డిస్‌ప్లే, అదనంగా 2.1 అంగుళాల మోనోక్రొమాటిక్ డిస్‌ప్లే ఉన్నాయి. దీనిని యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ద్వారా ఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios