Asianet News TeluguAsianet News Telugu

టిక్ టాక్ లో మనమే మేటి... భారత్ కు లేదు పోటీ!

ఇండియాలో బాగా పాపులర్ అయినా టిక్ టాక్ వినియోగం‌లో భారత్ నెంబర్1 గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 2019 సంవత్సరానికిగాన 1.5 బిలియన్ల మంది ఈ ఆప్ ని డౌన్లోడ్ చేసుకోగా, అందులో 31 శాతం డౌన్లోడ్లు కేవలం భారత దేశంలోనే జరిగాయి

Tik Tok: India tops the global list with one third of the total downloads
Author
Beijing, First Published Nov 17, 2019, 2:59 PM IST

భారత్ లో టిక్ టాక్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో వేరుగా చెప్పనక్కర్లేదు. టిక్ టాక్ వల్ల కొందరు ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకుంటుంటే, ఇంకొందరేమో రెండో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఏకంగా టిక్ టాక్ ద్వారా వచ్చిన పాపులారిటీ తోని కొందరు ఎన్నికల బరిలో కూడా దిగారు. 

ఇంత లెవెల్ లో ఇండియాలో బాగా పాపులర్ అయినా టిక్ టాక్ వినియోగం‌లో భారత్ నెంబర్1 గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 2019 సంవత్సరానికిగాన 1.5 బిలియన్ల మంది ఈ ఆప్ ని డౌన్లోడ్ చేసుకోగా, అందులో 31 శాతం డౌన్లోడ్లు కేవలం భారత దేశంలోనే జరిగాయి. దాదాపుగా మూడింతలో ఒకింత ఆంటే, 614 మిలియన్ డౌన్‌లోడ్లతో భారతదేశం ప్రధమ స్థానాన్ని కైవసం చేసుకుంది. 

Also read: tik tok: టిక్ టాక్ లో వీడియోలు... భార్యను చంపిన భర్త
 
గత సంవత్సరం తోని పోల్చుకుంటే, ఆరు శాతం డౌన్లోడ్లు అధికంగా అయ్యాయి. నాన్ గేమింగ్ కేటగిరీలో  భారత దేశానికి సంబంధించి  707.40 మిలియన్ ఇన్‌స్టాల్స్‌తో వాట్సాప్ మొదటి స్థానంలో ఉండగా, 636.20 మిలియన్ డౌన్లోడ్లతో ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ రెండవ స్థానంలో నిలిచింది.

గతంలో టిక్ టాక్, హలో యాప్ లకు  కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ రెండు యాప్ లు చట్ట విరుద్ద కార్యకాలపాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్న నేపథ్యంలో...  సదరు యాప్ యాజమన్యాలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 21ప్రశ్నలతో కూడా నోటీసులను పంపిస్తూ...వాటికి సమాధానం చెప్పాలని చెప్పింది. ఆ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోతే వాటిని దేశంలోనే నిషేధిస్తామని కేంద్రం హెచ్చరించింది.

ఈ రెండు యాప్ లపై వచ్చిన ఆరోపణలపై ఐటీ శాఖ ఆయా కంపెనీలను వివరణ కోరింది. వినియోగదారులకు సంబంధించిన సమాచారం.. భవిష్యత్తులో గానీ ఇతర దేశాల వ్యక్తులకు, ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేయమని హామీ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. రాజకీయ ప్రకటనల కోసం ఈ సంస్థలు డబ్బులు ఖర్చు పెడుతున్నాయని వచ్చిన ఆరోపణలపై కూడా వివరణ ఇవ్వాలని కోరింది.

Also read: సంసారంలో చిచ్చు రేపిన టిక్‌టాక్‌: మొదటి భార్య హత్యకు యత్నం, చివరికిలా..

18ఏళ్ల లోపు వారికి ఈ యాప్ ని నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది. కొద్ది నెలల క్రితం దేశంలో టిక్ టాక్ యాప్ ని కొద్ది రోజులు నిషేధించిన సంగతి తెలిసిందే. కాగా.. తర్వాత ఆ యాప్ ని మళ్లీ పునరుద్ధరించారు. 

టిక్ టాక్ లో వీడియోలు చేసి క్రేజ్ సంపాదించుకున్న సోనాలీ... హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఆమె హర్యానా ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిక్ టాక్ లో లక్షల కొద్ది ఫాలోవర్స్ ఉన్న ఆమె, హర్యానా రాష్ట్రంలోని అదంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్  దక్కించుకుని అక్కడ ఓటమి చెందిన విషయం కూడా తెలిసిందే. 

ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏది మాట్లాడినా... అది అట్టే వైరల్ అయిపోయేది.  ఆమె ప్రచారంలో భాగంగా... ప్రజలను ఉద్దేశించి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అదే నినాదాన్ని సభకు వచ్చిన ప్రజలను కూడా చేయాలని కోరారు. అయితే... కొందరు యువకులు ఆమె చెప్పినట్లు భారత్ మాతాకీ జై నినాదాలు చేయలేదు. దీంతో...ఆమె అసహనం వ్యక్తం చేశారు.

Also read: పోలీస్ స్టేషన్ లో టిక్ టాక్.. ఉద్యోగం హుష్ కాకీ!

అక్కడితో ఆగకుండా...మీరంతా పాకిస్తాన్ నుంచి వచ్చారా అంటూ ప్రశ్నించడం గమనార్హం. అంతేకాకుండా ఆ నినాదం చేయని వారి ఓటుకి అసలు విలువ లేదు అంటూ ఆమె కామెంట్స్ చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ "భారత్ మాతాకి జై" అనే నినాదం చేశారు ఫోగాట్. ఆ నినాదాన్ని గట్టిగా పలకలేనప్పుడు సిగ్గుపడాలి అని ఆమె అన్నారు. అంతేకాదు అక్కడ గట్టిగా నినాదాన్ని పలకనివారిని ఉద్ధేశిస్తూ.."మీరంతా పాకిస్తాన్ నుండి వచ్చారా? మీరు పాకిస్తానీలా? కాదు కదా? మీరు భారతీయులైతే భారత్ మాతా కి జై అని చెప్పండి" అంటూ ఆమె అన్నది.

కొంతమంది అప్పటికి కూడా నినాదం పలకకపోవడంతో "భారత్ మాతాకి జై అని పలకలేనివాళ్లు సిగ్గు పడాలని, రాజకీయాల కోసం భారత్ మాతాకి జై అని చెప్పలేని వారి ఓట్లకు విలువ లేదు" అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక అక్టోబర్ 21వ తేదీన హర్యానా రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయిపై ఆమె ఆడంపూర్‌లో పోటీ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios