భార్య తరచూ టిక్ టాక్ లో వీడియోలు పోస్టు చేస్తుందనే కారణంతో ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కనిగిరి మండలం తాలూరు ప్రాంతానికి చెందిన  మహిళ ఫాతిమా(30) కొంత కాలం క్రితం  ఓ టైలర్ ని వివాహం చేసుకుంది. ఈ దంపతులు తాలూరులో కాపురం పెట్టారు. కాగా... ఫాతిమా టిక్ టాక్ కి బానిసగా మారింది. తరచూ వీడియోలు తీయడం టిక్ టాక్ లో పోస్టు చేయడం ఇదే ఆమె పని. ఆమె వీడియోలను ఇటీవల భర్త సోషల్ మీడియాలో చూశాడు.

also readసంసారంలో చిచ్చు రేపిన టిక్‌టాక్‌: మొదటి భార్య హత్యకు యత్నం, చివరికిలా

అంతే... అతనికి కోపం నాశాలానికి అంటింది. వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించాడు. కాగా... అతని హెచ్చరికలను ఆమె సీరియస్ గా తీసుకోలేదు.  భర్త వార్నింగ్ ఇచ్చినా కూడా వీడియోలు తీసి టిక్ టాక్ లో అప్ లోడ్ చేయడం కొనసాగించింది. ఈ విషయంలో భార్యభర్తల మధ్య చాలాసార్లు వివాదం తలెత్తింది.

తాను ఎంత చెప్పినా మారకపోవడంతో... భర్తకు ఫాతిమా మీద అనుమానం కలిగింది. వేరే ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుందా అని అనుమానించడం మొదలుపెట్టాడు.ఈ క్రమంలో గురువారం కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో చపాతి కర్రతో ఫాతిమా తలపై పలుమార్లు కొట్టి చంపేశాడు. అనంతరం ఆమెను ఉరితాడికి వేలాడదీసి...  ఆత్మహత్య చేసుకుందని నమ్మించాడు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా... అసలు నిజం వెలుగుచూసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

టిక్ టాక్ లో ఫేమస్ విలన్... తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య