పోలీస్ స్టేషన్ లో టిక్ టాక్.. ఉద్యోగం హుష్ కాకీ!
ఓ మహిళా పోలీసు అధికారి పోలీస్ స్టేషన్ లోనే టిక్ టాక్ వీడియో చేసింది... తీరా ఆ వీడియో కారణంగానే ఉద్యోగం పోగొట్టుకుంది. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
ప్రస్తుతం యువతకు టిక్ టాక్ పిచ్చి పట్టింది. సినిమాల్లోని పాటలకు డ్యాన్స్ లు వేస్తూ... వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి ఫేమస్ అయిపోవాలని తెగ ఆరాటపడిపోతున్నారు. అయితే ఈ పిచ్చి కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటికి మొన్న ఖమ్మం మున్సిపల్ సిబ్బంది ఆఫీసులో టిక్ టాక్ లుచేసి అడ్డంగా బుక్కయిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటనే మరోటి చోటుచేసుకుంది.
ఓ మహిళా పోలీసు అధికారి పోలీస్ స్టేషన్ లోనే టిక్ టాక్ వీడియో చేసింది... తీరా ఆ వీడియో కారణంగానే ఉద్యోగం పోగొట్టుకుంది. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... గుజరాత్ రాష్ట్రం ముస్తాబై పోలీస్ స్టేషన్ లో అర్పితా అనే ఓ మహిళా పోలీసు అధికారి ఓ బాలీవుడ్ పాటకు టిక్ టాక్ చేసింది. ఆ వీడియోని తన స్నేహితులతో షేర్ చేసుకొని ఎలా ఉందంటూ అడిగింది,
ఆ వీడియో వైరల్ అయ్యి గుజరాత్ పోలీసుల కంట పడింది. విధులు నిర్వహించకుండా పోలీస్ స్టేషన్ లోనే ఇలా వీడియోలు చేశారని... ఆఫీసులో కనీసం యూనిఫాం కూడా వేసుకోలేదని ఆమెపై మండిపడ్డారు. అక్కడితో ఆగలేదు ఆమెను విధుల నుంచి కూడా బహిష్కరించారు. ఈ విషయాన్ని గుజరాత్ పోలీసులు సోషల్ మీడీయా వేదికగా ప్రకటించారు.