Asianet News TeluguAsianet News Telugu

షియోమీతో ‘టగ్ ఆఫ్ వార్’: ఆర్థిక సేవల్లోకి రియల్‌మీ

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు షియోమీ, రియల్ మీ, వన్ ప్లస్ వివిధ రకాల సేవల్లో పోటీ పడుతున్నాయి. తాజాగా చౌక ఫోన్ల తయారీ సంస్థ షియోమీతో రియల్ మీ ఆర్థిక సేవలందించేందుకు సిద్ధమైంది. అందుకోసం పైసా యాప్‌ ఆవిష్కరించింది. రూ.1 లక్ష దాకా వ్యక్తిగత రుణాలివ్వడంతోపాటు కస్టమర్లకు వచ్చే ఏడాది నుంచి ఉచిత క్రెడిట్‌ రిపోర్ట్స్, ఇతర సేవలను అందుబాటులోకి తేనున్నది.

Realme ups ante against Xiaomi with Paysa
Author
Hyderabad, First Published Dec 18, 2019, 11:31 AM IST

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌ మీ సేవలందించడంలో మరో సంస్థ షియోమీతో పోటీ పడుతోంది. తాజాగా ఆర్థిక సేవల విభాగంలోకి ప్రవేశించింది. రుణాలు, మ్యూచువల్‌ ఫండ్స్, క్రెడిట్‌ స్కోర్‌ రిపోర్టులు అందించేందుకు ‘రియల్‌మీ పైసా’ పేరిట ప్రత్యేక ప్లాట్‌ఫాం ప్రారంభించింది. 

స్మార్ట్‌ఫోన్ల విభాగంలో ప్రత్యర్థి సంస్థ షియోమీ ఇటీవలే ’మీ క్రెడిట్‌’ పేరుతో ఇలాంటి ఆర్థిక సర్వీసులే ప్రారంభించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. రియల్‌మీ పైసా బీటా యాప్‌ ద్వారా డిజిటల్‌ వ్యక్తిగత రుణాలు సుమారు రూ.  లక్ష దాకా, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలు  రూ.5 లక్షల దాకా రుణాలు పొందవచ్చు.

also read  ప్రీపెయిడ్ ప్లాన్ల వాలిడిటీని తగ్గించిన బి‌ఎస్‌ఎన్‌ఎల్...ఎంతంటే..?

తక్షణ ఉచిత క్రెడిట్‌ రిపోర్టులు, మూడు నెలలు ఉచితంగా అప్‌డేట్స్, పాత.. కొత్త ఫోన్లకు స్క్రీన్‌ డ్యామేజ్‌ బీమా సర్వీసులు ఈ యాప్‌ ద్వారా రియల్‌మీ అందించనున్నది. 2020లో ఈ ప్లాట్‌ఫాం ద్వారా రూ. 1,000 కోట్ల దాకా రుణ వితరణ, 30–50 లక్షల మంది కొత్త కస్టమర్లకు చేరువ కావాలనేది తమ లక్ష్యమని రియల్‌మీ పైసా లీడ్‌ వరుణ్‌ శ్రీధర్‌ తెలిపారు. 

Realme ups ante against Xiaomi with Paysa

‘మూడేళ్లలో బ్రేక్‌ ఈవెన్‌ వస్తుందని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న రియల్‌మీ పైసా యాప్‌.. గూగుల్‌ ప్లేస్టోర్‌తో పాటు రియల్‌మీ యాప్‌స్టోర్‌లో లభిస్తుంది. రానున్న 6–12 నెలల్లో పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తాం’ అని  శ్రీధర్‌ తెలిపారు.మరిన్ని ఆర్థిక సేవలను త్వరలో పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు శ్రీధర్.

also read  కొత్త స్మార్ట్‌వాచ్...ఒక్కసారి చార్జ్ చేస్తే 10 రోజుల వరకు...

గూగుల్​ ప్లేస్టోర్, రియల్ మీ యాప్​ స్టోర్​లలో పైసా యాప్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 6-12 నెలల్లో పేసాను పూర్తి స్థాయిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరో ప్రీమియం స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ వన్​ప్లస్​ సైతం తన 'వన్​ప్లస్ పే' మొబైల్ చెల్లింపుల వ్యవస్థను తయారుచేస్తున్నట్లు ప్రకటించింది. ఇది 2020లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios