పోర్ట్రానిక్స్ బ్రాండ్ పోర్టబుల్ ఇంకా వినూత్న గాడ్జెట్‌  “యోగ్ క్రోనోస్” ను లాంచ్ చేసింది. స్మార్ట్‌వాచ్ పోర్ట్‌ఫోలియో పరిధిని విస్తరించడానికి ప్రసిద్ది చెందింది. యోగ్ క్రోనోస్ స్మార్ట్ వాచ్ కమ్ ఫిట్ నెస్ ట్రాకర్ మీరు రోజు చేసే ఫిట్ నెస్ ఎక్సైజ్ లను స్విఫ్ట్ ట్రాకింగ్ నోటిఫికేషన్లతో సెట్ చేయడానికి ఇంకా ట్రాక్ చేయడానికి మీకు సహాయపడుతుంది.

also read  గుడ్ న్యూస్...ఇక ఎప్పుడైనా..మని ట్రాన్సక్షన్స్ చేయొచ్చు!!

యోగ్ క్రోనోస్ వాచ్ లో టచ్-ఎనేబుల్ చేసిన 1.3-అంగుళాల కలర్ స్క్రీన్‌,  హార్ట్ బీట్ రేటు, డైలీ ఆక్టివిటీస్,  స్టెప్స్, కేలరీలు, డిస్టెన్స్, స్లీప్ ట్రాకింగ్ ఇంకా మీ రోజువారీ కార్యాచరణలను ట్రాక్ చేస్తుంది. రిమైండర్‌లను కూడా ఇందులో సెట్ చేసుకోవచ్చు. ఇది మీ సోషల్ యాప్స్, ఇమెయిల్‌లు, మిస్డ్ కాల్స్ లను ట్రాక్  చేస్తుంది. వెరీఫిట్ ప్రో యాప్‌ను ఉపయోగించి మీరు మీ డేటాను మీ స్మార్ట్‌ఫోన్‌తో సింక్ చేసుకోవచ్చు.

యోగ్ క్రోనోస్ స్మార్ట్ వాచ్ డస్ట్ ఇంకా వాటర్ రెసిస్టంట్, మీరు అన్ని సీజన్లలో యోగ్ క్రోనోస్‌ను మీ ఫిట్‌నెస్ వాడుకోవచ్చు. దాని IP68 డిజైన్ ద్వారా మీరు ఎలాంటి వాతావరణ పరిస్థితులలోనైన దీనిని ధరించవచ్చు. వాచ్ బరువు 40.8 గ్రాములు మాత్రమే, వాచ్  మెటీరియల్  క్వాలిటి కూడా చాలా సౌకర్యవంతంగా ఇంకా మీ చర్మానికి అనుకూలంగా ఉంటుంది. ఇది చాలా ఫోర్మల్ గా, కాజుయల్ లుక్ తో  చక్కగా ఉంటుంది.

also read మొబైల్ నెంబర్ పోర్టబిలిటీపై ట్రాయ్ కొత్త రూల్స్...

వాచ్‌లో సూపర్ ఈజీ ఛార్జింగ్, లాంగ్ ప్లే టైమ్ ఉన్నాయి. దీనికి మాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ ఉపయోగించి దాని ఇంటర్నల్ 210 mAh బ్యాటరీని సులభంగా ఛార్జ్ చేయవచ్చు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ఇది 8 నుండి 10 రోజుల వరకు పని చేస్తుంది. కొత్త యోగ్ క్రోనోసిస్ ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్ స్టోర్లలో రూ .1,999కు లభిస్తుంది దీనితో పాటు 1 సంవత్సర వారంటీ కూడా వస్తుంది.