బిఎస్‌ఎన్‌ఎల్  అతిపెద్ద సర్కిల్‌లలో ఒకటైన కేరళలో ప్రీపెయిడ్ ప్లాన్‌లను సవరించింది. ప్లాన్ ధరలను పెంచే బదులు టెల్కో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లపై ప్రయోజనాలను తగ్గించింది. వీటిలో కొన్ని ప్లాన్‌ల ధరలు రూ. 118, రూ. 187, ఇంకా రూ. 399, ప్లాన్ల వాలిడిటీని తగ్గించింది.

దేశంలోని మూడు ప్రధాన టెలికం ఆపరేటర్లు తమ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే బిఎస్‌ఎన్‌ఎల్ ఈ నిర్ణయం తీసుకుంది.బిఎస్‌ఎన్‌ఎల్ రూ. 399 ప్లాన్ వాలిడిటీని 80 రోజుల నుండి 65 రోజులకు తగ్గించారు.

also read కొత్త స్మార్ట్‌వాచ్...ఒక్కసారి చార్జ్ చేస్తే 10 రోజుల వరకు...


బిఎస్‌ఎన్‌ఎల్ కేరళ సర్కిల్‌లో రూ.118 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీని ఇప్పుడు 28 రోజులకు బదులుగా 21 రోజుల వాలిడిటీని మాత్రమే అందిస్తుంది. రోజుకు 250 నిమిషాలు వాయిస్ మినట్స్, రోజుకు 0.5 జిబి హై-స్పీడ్ డేటా (ఎఫ్‌యుపి తర్వాత స్పీడ్ 40 కెబిపిఎస్‌కు తగ్గించబడింది), ఫ్రీ పిఆర్‌బిటి ఇంకా రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు ఎప్పటిలాగే ఉంటాయి.

అదేవిధంగా కేరళలో రూ. 187 ప్లాన్ వాలిడిటీని 28 రోజులకు బదులుగా 24 రోజులకు తగ్గించారు. రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్ (లోకల్ / ఎస్టీడీ / రోమింగ్ ఇంక్ ముంబై & ఢిల్లీ), రోజుకు 3 జిబి హై-స్పీడ్ డేటా (స్పీడ్ 40 కెబిపిఎస్ పోస్ట్ ఎఫ్‌యుపికి తగ్గించబడింది), రోజుకు 100 ఎస్‌ఎంఎస్, ఫ్రీ పిఆర్‌బిటి బండ్లింగ్‌.

రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటాను అందించే రూ. 153 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా అంతకుముందు 28 రోజుల ఉన్న వాలిడిటీని ఇప్పుడు 21 రోజులకి తగ్గించారు. ఇక రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు 65 రోజుల వాలిడిటీ మాత్రమే అందిస్తుంది. ఈ ప్లాన్ ప్రస్తుతం ఇతర సర్కిల్‌లలో 80 రోజుల వాలిడిటీని ఉంది.

also read గుడ్ న్యూస్...ఇక ఎప్పుడైనా..మని ట్రాన్సక్షన్స్ చేయొచ్చు!!

అయితే కేరళలో మాత్రమే వాలిడిటీని 15 రోజులకు తగ్గించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేరళ సర్కిల్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ రోజుకు 1 జిబి నుండి డేటా క్యాప్‌ను రోజుకు 2 జిబికి పెంచింది. అన్ని ఇతర అన్నీ రీఛార్జి ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి, అంటే రోజుకు 100 SMS, 250 నిమిషాల వాయిస్ కాల్స్, ఉచిత PRBT. ఈ ప్లాన్ మార్పులను కేరళ రాష్ట్రం బి‌ఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు.  

ఇటీవల, బిఎస్ఎన్ఎల్ తన తక్కువ-ధర రూ. 29 మరియు రూ. 47 ప్రీపెయిడ్ ప్రణాళికలు. టెలికాం ఆపరేటర్ ఈ కొత్త చెల్లుబాటు తగ్గింపు వ్యూహాన్ని ఇతర సర్కిల్‌లలో కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.