Asianet News TeluguAsianet News Telugu

భాగ్యనగరిలో సేవలకు ఒప్పో ఆర్&డీ కేంద్రం రెడీ: విపణిలోకి రెనో జూమ్.. రెనో

చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘ఒప్పో’ అద్భుత ఫీచర్లతో రెనో, రెనో 10ఎక్స్‌ జూమ్‌ ఎడిషన్‌ ఫోన్లను విపణిలోకి విడుదల చేసింది. రెండు మోడల్స్ ఫోన్లలోనూ ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ లాంటి ఫీచర్లు జోడించింది. వచ్చే నెల ఏడో తేదీ నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం  మాల్‌, స్నాప్‌డీల్‌‌లో ఈ ఫోన్లు లభిస్తాయి. 

Oppo Reno 10x Zoom, Oppo Reno launched: Key specs, features, price in India and everything else
Author
New Delhi, First Published May 29, 2019, 10:22 AM IST

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘ఒప్పో’హైదరాబాద్‌లోని పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతోంది. భారత మార్కెట్లో విక్రయించే అన్ని మొబైల్‌ ఫోన్ల ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ (ఓఎస్‌) అప్‌డేట్స్‌ అన్నీ ఈ కేంద్రం నుంచే నిర్వహించాలని భావిస్తోంది. 

ఓఎస్ అప్ డేట్స్ హైదరాబాద్ సెంటర్ నుంచే
రెనో సిరీస్‌లో రెండు స్మార్ట్‌ ఫోన్ల విడుదల కార్యక్రమంలో ఒప్పో భారత విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ తస్లీం అరీఫ్‌ ఈ సంగతి చెప్పారు. ఇప్పటికే ఉన్న ఒఎస్‌తోపాటు ఆండ్రాయిడ్‌, కలర్‌ ఓఎస్‌ అప్‌డేట్స్‌ కూడా హైదరాబాద్‌ సెంటర్‌ నుంచి విడుదల చేస్తామని పేర్కొన్నారు. 

వీఓఓసీ 3.0 పేరిట కొత్త చార్జర్ అభివ్రుద్ధి
భారత్‌లోని మొబైల్‌ ఫోన్ల వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఈ అప్‌డేట్స్‌ ఉంటాయని ఒప్పో భారత విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ తస్లీం అరీఫ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఒప్పో ఆర్‌ అండ్‌ డీ కేంద్రం ఇప్పటికే ‘వీఓఓసీ 3.0’ పేరుతో కొత్త చార్జర్‌ను అభివృద్ధి చేసింది. ఈ చార్జర్‌ ద్వారా అరగంటలోనే 70 శాతం మొబైల్‌ ఫోన్‌ బ్యాటరీ చార్జింగ్‌ అవుతుందని అరిఫ్‌ చెప్పారు.

డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌తో రెనో, రెనో 10ఎక్స్ జూమ్
ఒప్పో రెనో, రెనో 10ఎక్స్‌ జూమ్‌ పేరుతో మంగళవారం న్యూఢిల్లీలో విడుద‌ల చేసింది. వీటిల్లో ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ లాంటి ఫీచర్లు జోడించింది. 
ఒప్పో రెనోను సింగల్‌ వేరియంట్‌గానే తీసుకొచ్చింది. 

రెండు వేరియంట్లలో రెన్ ఎక్స్ జూమ్
రెనో ఎక్స్‌ జూమ్‌ను రెండు వేరియంట్లలో ఆవిష్కరించింది. వినియోగ‌దారుల‌కు జూన్ 7వ తేదీ నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పే టీఎం మాల్‌, స్నాప్‌డీల్‌ద్వారా ఈ ఫోన్ ల‌భ్యం కానుంది.

రెనో ఫీచర్లు ఇలా
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే కలిగి ఉన్న ఒప్పో రెనో ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌ అమర్చారు. 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం ఇందులో ఉంది‌. 

రూ.32,990 నుంచి రెనో ధర మొదలు
ఆండ్రాయిడ్ 9.0 పైతోపాటు 48+ 5ఎంపీ డ్యుయ‌ల్ రియర్‌ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా చేర్చారు. ఈ ఫోన్‌లో 3765 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాట‌రీ కూడా ఉంది.  జీబీర్యామ్‌ విత్ 128జీబీ స్టోరేజ్‌ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.32,990 నుంచి మొదలవుతుంది. 

ఇవీ రెనో 10 ఎక్స్ జామ్ ఫీచర్లు
రెనో 10 ఎక్స్‌ జూమ్‌ 6.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్855 ప్రాసెస‌ర్‌ అమర్చారు. 1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌తోపాటు ఆండ్రాయిడ్ 9.0 పై అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్‌ విత్ 256 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యం గల ఈ ఫోన్‌లో 8+13+8ఎంపీ  ట్రిపుల్‌ రియర్‌ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా చేర్చారు. 

రూ.39,990 నుంచి రెనో 10ఎక్స్ జూమ్ ధర మొదలు
ఇక 4065 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాట‌రీ అసెంబ్లింగ్ చేశారు. ఈ మోడల్ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్‌ విత్ 128జీబీ స్టోరేజ్‌ సామర్థ్యం గల వేరియంట్ ధర రూ.39,990, 8 జీబీ ర్యామ్‌ విత్ 256 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.49,990గా నిర్ణయించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios