ప్రముఖ కంపెనీ నోకియా ఇప్పుడు ఒక కొత్త ఫోన్ ని విడుదల చేసింది. నోకియా  సి1 మోడల్ ఫోన్ని బుధవారం నోకియా బ్రాండ్ లైసెన్స్‌దారి హెచ్‌ఎండి గ్లోబల్ కీన్యాలో దీన్ని లాంచ్ చేసింది. సరికొత్త ఆండ్రాయిడ్ గో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌గా నోకియా సి1 ఫోన్ నిలిచింది. 

నోకియా సి1 స్మార్ట్‌ఫోన్ ట్రెడిషనల్ డిజైన్‌తో నోచెస్, హోల్-పంచ్, పాప్-అప్ కెమెరాలు లాంటివి లేకుండా వస్తుంది. ఫోన్  ముఖ్యమైన ఫీచర్స్ ఏంటి అంటే ఇందులో క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్, 2,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఫీచర్ ఫోన్స్ నుండి వినియోగదారుల కోసం HMD గ్లోబల్ దీనిని మొదటి స్మార్ట్‌ఫోన్‌గా ప్రవేశపెడుతుంది.

also read  ఆపిల్ 16 inch మాక్‌బుక్ ప్రో లాంచ్...ధర ఎంతంటే ?


"ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఎపిఎసి మార్కెట్లలోని మిలియన్ల మంది వినియోగదారులు ఇక ఫీచర్ ఫోన్ నుండి నోకియా మొదటి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవుతారు అని మేము అనుకుంటున్నం" అని  హెచ్‌ఎండి గ్లోబల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జుహో సర్వికాస్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. "నోకియా సి1 ఒక  నమ్మకమైన స్మార్ట్‌ఫోన్ ఇది 3జి కనెక్టివిటీతో, తక్కువ ధరతో  గొప్ప అనుభవాలను ఇస్తుంది."


నోకియా సి 1 ఫీచర్స్
డ్యూయల్ సిమ్ (నానో), నోకియా సి1 ఆండ్రాయిడ్ 9 పై (గో ఎడిషన్)తో నడుస్తుంది. ఈ ఫోన్ 5.45-అంగుళాల ఎఫ్‌డబ్ల్యువిజిఎ + ఐపిఎస్ డిస్‌ప్లేతో ఉంటుంది. ఆన్ ఐడెంటిఫైడ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్ ఇతర ఫీచర్ మైక్రో-యుఎస్బి పోర్ట్, గూగుల్ అసిస్టెంట్ బటన్ ఇంకా 1 జిబి ర్యామ్.

also read ఇండియన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన లైట్ వెయిట్ ఇయర్‌బడ్స్‌...ధర ఎంతంటే ?

నోకియా సి1 వెనుక భాగంలో ఎఫ్ / 2.4 తో 5 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా, అదనంగా ఫ్రంట్ సైడ్ లో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్, ఫోన్ ముందు వెనుక రెండు ఫ్లాష్ లైట్లు ఉంటాయి. ఇతర స్పెసిఫికేషన్లలో దీనికి 2,500 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్‌ఎం రేడియో, 16 జిబి ఇన్బిల్ట్ స్టోరేజ్, మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్ (64 జిబి వరకు)తో వస్తుంది. ఫోన్ 3జికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, 4జి కనెక్టివిటీ ఇందులో లేదు. నోకియా సి1 మోడల్ 147.6 x 71.4 x 8.7mm సైజ్, 155 గ్రాముల బరువు ఉంటుంది.