భారతదేశంలో కొత్త  వైర్‌లెస్ ఆడియో డివైజ్ ఒలిమ్‌బడ్స్ హైఫ్యూచర్ లాంచ్ చేసింది. ఫ్యూచర్‌బడ్స్, నెక్ లెస్, టైడీబడ్స్‌ ప్రోలను విజయవంతంగా లాంచ్  చేసిన తరువాత స్టైల్, కంఫర్ట్, మ్యూజిక్ కోసం ప్రత్యేకమైన ఒలింబడ్స్‌ను హైఫ్యూచర్ బ్రాండ్ ప్రవేశపెట్టింది.

ఆశ్చర్యపరిచే అనేక ఫీచర్లతో నిండిన కొత్త వైర్‌లెస్ ఒలింబుడ్స్ సంగీత ప్రియుల కోసం సృష్టించిన ఇయర్‌బడ్స్. ఇందులో డైనమిక్ N42 నియోడైమియం మాగ్నెట్ డ్రైవర్‌ ఉండటం వల్ల మంచి బేస్, హైఫై స్టీరియో సౌండ్ అనుభూతిని ఇస్తుంది. సరికొత్త బ్లూటూత్ 5.0 వెర్షన్‌తో గ్లోబల్ రియల్టెక్ చిప్‌సెట్‌లో ఇది నిర్మించబడింది. సూపర్-స్టేబుల్ ట్రాన్స్మిషన్, ఇన్స్టంట్ కనెక్టివిటీ, 35 అడుగుల వరకు డివైజెస్ కనెక్ట్ అవుతుంది.  

also read  వాట్సాప్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్...ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.

హైఫ్యూచర్ ఒలిమ్‌బడ్స్ కంప్లీట్ టచ్ కంట్రోల్‌తో వస్తుంది. రెండు ఇయర్‌బడ్‌లలోని టచ్ సెన్సార్లు వినియోగదారులకు పూర్తి నియంత్రణను ఇస్తాయి. మ్యూజిక్ పాజ్ చేయడానికి  లేదా ప్లే చేయడానికి, వాల్యూమ్‌ను కంట్రోల్ చేయడానికి, మ్యూజిక్ ట్రాక్‌లను మార్చడానికి, ఫోన్ కాల్‌ ఆన్సర్ చేయడానికి లేదా కట్ చేయడానికి వీలు కల్పిస్తాయి.


 ఇవి చాలా తేలికగా  మరియు కాంపాక్ట్ ఛార్జింగ్ కేసుతో సులభంగా ఎక్కడికైనా తెసుకెళ్లవచ్చు. వినియోగదారుడికి  ఇయర్‌బడ్స్‌ సౌకర్యవంతంగా  ఉండడానికి అధిక నాణ్యత గల సిలికాన్‌ను హైఫ్యూచర్ ఉపయోగించింది. ఇండియన్స్ కోసం ప్రత్యేకంగా వీటిని డిజైన్ చేసి రూపొందించారు. చెవిలో ఫిట్‌ చేసుకోవడానికి మీకు 3  సైజ్ల ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ కూడా పొందుతారు. ఇవి పడిపోతాయనే భయం లేకుండా మీరు ఫ్రీగా జగింగ్, రన్నింగ్ లాంటి అన్నీ వ్యాయామాలు చేసుకోవచ్చు.

హైఫ్యూచర్ ఒలింబుడ్స్ ఇయర్-కాప్ పై మెరిసే మాట్టే డిజైన్ తో వస్తుంది. ఇయర్‌బడ్స్‌ లోపలి భాగంలో స్మార్ట్ పోగో పిన్‌లు ఉంటాయి. మీరు వాటిని కేసు నుండి తీసినప్పుడు మీ డివైజ్ కి కనెక్ట్ అవుతుంది. ఇయర్‌బడ్‌లను సులభంగా గుర్తించడానికి లెఫ్ట్, రైట్ సైడ్ సింబల్స్ కలిగి ఉంటాయి.

also read స్మార్ట్​ఫోన్​కు రక్షణ కల్పించే యూఎస్బీ కండోమ్​ గురించి తెలుసా?


ఒలిమ్‌బడ్స్ మీకు ఒకే ఛార్జీతో 6 గంటల ప్లేబ్యాక్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇవి మాగ్నెటిక్ ఛార్జింగ్ కేసులో వస్తాయి. ఇది మీకు 500 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ కేసు మైక్రో-యుఎస్బి పోర్ట్ సపోర్టుతో వస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ కోసం కేసు ముందు 3 లీడ్ లైట్స్ ఉంటాయి.

 ఈ ఇయర్‌ఫోన్‌లు వాటర్ ప్రూఫ్, స్వేట్ ప్రూఫ్ ఇంకా అన్ని ఇండోర్ మరియు ఔట్ డోర్  గేమ్స్ సమయంలో వాడుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ డివైజ్లకు కనెక్ట్ అయినప్పుడు సిరి, గూగుల్ అసిస్టెంట్‌ను హైఫ్యూచర్ ఒలిమ్‌బడ్స్‌లో ఉపయోగించవచ్చు. ఒలిమ్‌బడ్స్ కేవలం 3,999 రూపాయలకు అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ లో లభిస్తాయి. ఇది 2 రంగులలో వస్తుంది  వైట్ ఇంకా  బ్లాక్ దినీకి 1 సంవత్సరం పాటు వారంటీ కూడా ఉంటుంది.