ఆపిల్ సంస్థ భారతదేశంలో పెద్ద స్క్రీన్, మెరుగైన కీబోర్డ్‌తో కొత్త 16-అంగుళాల మాక్‌బుక్ ప్రో అమ్మకాలను ప్రారంభించింది. హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో నోట్‌బుక్ ధర 1,99,900 రూపాయల నుండి మొదలవుతుంది.

ఆపిల్ అతరైజడ్  రిసెల్లర్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్ నుండి దీనిని కొనుగోలు చేయవచ్చు. 16-అంగుళాల మాక్‌బుక్ ప్రో 15-అంగుళాల మోడల్‌కు సీక్వెల్ గా ఉంటుంది. ఆపిల్ 15-అంగుళాల మాక్‌బుక్ మోడల్‌ ప్రస్తుతం అందుబాటులో లేదు కానీ ఇ-కామర్స్ వెబ్‌సైట్ల నుండి కొనుగోలు చేయవచ్చు.

also read ఇండియన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన లైట్ వెయిట్ ఇయర్‌బడ్స్‌...ధర ఎంతంటే ?

సరికొత్త 16-అంగుళాల మాక్‌బుక్ ప్రో, అద్భుతమైన నోట్‌బుక్‌ ఫీచర్లను అందించడానికి ఆపిల్ అనేక మార్పులు చేసింది. రాడికల్ న్యూ  డిజైన్ కాకుండా 16-అంగుళాల మాక్‌బుక్ ప్రో రెండు ప్రధాన మార్పులను చేసింది. మెరుగైన కీబోర్డ్ ఇంకా కొంచెం పెద్ద స్క్రీన్.


కొత్త మాక్‌బుక్ ప్రోలోని కీబోర్డు దాని మ్యాజిక్ కీబోర్డ్‌తో సమానంగా ఉంటుంది. ఇది  బటర్ ఫ్లై కీబోర్డ్ డిజైన్ నుండి అప్‌గ్రేడ్ చేసింది. 2015 లో 12-అంగుళాల మాక్‌బుక్‌లో ప్రవేశపెట్టిన మొదటి బటర్ ఫ్లై- కీబోర్డ్‌ మాక్‌బుక్ ఇదే.16 అంగుళాల మాక్‌బుక్ ప్రో 15 అంగుళాల మోడల్ కంటే సన్నగా బెజెల్స్‌తో కొంచెం పెద్ద డిస్ ప్లేతో వస్తుంది. అదనంగా, ల్యాప్‌టాప్ పూర్తిగా రిడిజైన్ చేయబడిన ఆరు-స్పీకర్ల ఆడియో సిస్టమ్‌తో వస్తుంది.

also read  వాట్సాప్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్...ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.


16-అంగుళాల మాక్‌బుక్ ప్రో మూడు ప్రాసెసర్ వేరియంట్‌లలో వస్తుంది. ఇంటెల్ నుండి 6th-కోర్  i7, 8th-కోర్ i9 ప్రాసెసర్  రెండు వేరియంట్లు. బేస్ ర్యామ్ వేరియంట్ 16 జిబి అయితే ఇప్పుడు యూజర్లు 64 జిబి ర్యామ్ వరకు అప్‌గ్రేడ్ చేయవచ్చు, ఇది అంతకుముందు 32 జిబికి పరిమితం చేయబడింది. మాక్‌బుక్ ప్రోలో స్టోరేజ్ ఆప్షన్ 512GB, 1TBతో వస్తుంది అప్‌గ్రేడ్ ఆప్షన్ ద్వారా 1TB (512GB కోసం), 2TB, 4TB, 8TB SSD వరకు పెంచుకోవచ్చు.