హువావే  బ్రాండ్ తన కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్‌ను విడుదల చేసింది. హువావే బ్యాండ్ 4 ప్రో ఫిట్ నెస్ బ్యాండ్ హార్ట్ బీట్ సెన్సార్‌తో పాటు బ్లడ్ ఆక్సిజన్ లేవాల్స్ చూపిస్తుంది. SpO2 సెన్సార్‌తో ఇది పనిచేస్తుంది. హువావే బ్యాండ్ 4 ప్రో 0.95-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే అలాగే కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ కోసం ఎన్‌ఎఫ్‌సి సపోర్ట్ అందిస్తుంది.చైనాలో హువావే  కొత్త వేరియంట్‌ ఎంజాయ్ 10 ఎస్ ఫోన్ కూడా విడుదల చేసింది.


ఇది 11 రకాల హెల్త్ ఎక్సైజ్లను ట్రాక్ చేస్తుంది. హువావే బ్యాండ్ 4 ప్రోలో నావిగేషన్ కోసం ఇన్ బిల్ట్ GPS కూడా ఇందులో ఉంది. దీంతో పాటు హువావే కొత్త వేరియంట్‌ ఎంజాయ్ 10 ఎస్ ఫోన్ కంపెనీ విడుదల చేయనుంది.

also read  ఆపిల్ ఐఫోన్ SE 2 ప్లస్...పూర్తిగా వైర్‌లెస్ ఫోన్

హువావే బ్యాండ్ 4 ప్రో ధర
హువావే బ్యాండ్ 4 ప్రో ధర CNY 399 (సుమారు రూ. 4,000). బ్లాక్, పింక్, రెడ్ మూడు కలర్లలో వస్తుంది. ఇది ఇప్పుడు చైనాలో ప్రీ-ఆర్డర్‌ల కోసం సిద్ధంగా ఉంది. డిసెంబర్ 12 నుంచి అందుబాటులోకి రానుంది . హువావే బ్యాండ్ 4 ప్రో ఇండియన్ మార్కెట్లలో లభ్యతపై సమాచారం లేదు.

హువావే బ్యాండ్ 4 ప్రో ఫీచర్స్
హువావే బ్యాండ్ 4 ప్రో 0.65-అంగుళాల AMOLED డిస్ప్లే,  240x120 పిక్సెల్‌ రిజల్యూషన్‌, ఒకేసారి 40 చైనీస్ అక్షరాలను చూపిస్తుంది. వినియోగదారులు 100 ప్రీలోడ్ చేసిన వాచ్ ఫేస్‌లను ఎంచుకోవచ్చు. 

also read ఇలాగైతే వొడాఫోన్‌ ఐడియా మూసివేయాల్సి వస్తుంది...?


హువావే బ్యాండ్ 4 ప్రో హార్ట్ బీట్ ట్రాకర్‌తో పాటు రక్తంలో ఆక్సిజన్  లెవెల్స్ ని  తెలియజేస్తుంది. ఇందులో  హువావే బ్యాండ్ 4 సూప్-అప్ వెర్షన్, స్లీప్ ట్రాకింగ్, హువావే ట్రూస్లీప్ 2.0 టెక్నాలజీతో వస్తుంది. రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి 11 రకాల వ్యాయామాలను కూడా ట్రాక్ చేయవచ్చు.

హువావే ఎంజాయ్ 10 ఎస్ కొత్త వేరియంట్‌
 హువావే ఎంజాయ్ 10 ఎస్ కొత్త మోడల్‌ ఫోన్ ను కూడా విడుదల చేసింది. కొత్త హువావే ఎంజాయ్ 10 ఎస్ వేరియంట్ 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ తో వస్తుంది. పాత వేరియంట్లో 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్. ఇది ఇప్పటికే చైనాలోని విమాల్ ద్వారా అమ్మకాలు ప్రారంభం అయ్యాయి.