2021 ఐఫోన్ టాప్-ఎండ్ మోడల్‌లో ఆపిల్ పెద్ద మార్పుకు ప్లాన్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కుయో చేసిన అంచనాలను నిజమయితే, కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ 2021 ఐఫోన్ మోడల్‌లో లైటెనింగ్ పోర్ట్ ని తీసివేయాలని ఆలోచిస్తుంది. లైటెనింగ్ పోర్టును తెసేయడం ద్వారా ఆపిల్ ఐఫోన్‌ను పోర్టులు లేకుండా ఉంటుంది.

also read  ఇలాగైతే వొడాఫోన్‌ ఐడియా మూసివేయాల్సి వస్తుంది...?

ఐఫోన్ SE 2 ప్లస్ లో పవర్ బటన్‌ ఇప్పుడు టచ్ ఐడిని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5.5-అంగుళాల లేదా 6.1-అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి.మాక్‌రూమోర్స్ నివేదిక ప్రకారం, ఆపిల్ ఐఫోన్ తమ వినియోగదారులకు వైర్‌లెస్ ఫోన్ అనుభవాన్ని అందించాలని కోరుకుంటుంది. 2022 నుండి అన్ని ఐఫోన్ మోడళ్లలో కంపెనీ పూర్తిగా పోర్ట్స్ లేకుండా ఫోన్లని తిసుకురావాలనుకుంటుంది. 

"కొత్త 2021 ఐఫోన్ మోడళ్లలో, అత్యున్నత మోడల్ లైటెనింగ్ పోర్టును తిసివేసి, పూర్తిగా వైర్‌లెస్ అనుభవాన్ని అందించాలని మేము ఆశిస్తున్నాము" అని కుయో టిఎఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్  ఒక పరిశోధన నోట్‌లో రాశారు.2021 మొదటి భాగంలో ఆపిల్ ఐఫోన్ SE 2 ప్లస్‌ను తీసుకువస్తుందని కుయో పేర్కొంది. ఈ ఐఫోన్ మోడల్‌లో ఫేస్ ఐడి సపోర్ట్ ఉండదు అలాగే పవర్ బటన్‌లో టచ్ ఐడిని ప్యాక్ చేసి వస్తుంది. ఫేస్ ఐడి లేకపోవడం వల్ల ఫోన్‌లో చిన్న నాచ్ ఉంటుంది.

also read నోకియా నుండి తొలి స్మార్ట్ టీవీ: ఆవిష్కరించిన ఫ్లిప్‌కార్ట్


“ఆపిల్ ఐఫోన్ SE2 ప్లస్‌ను 1 హెచ్ 21 లో విడుదల చేస్తుంది. డిస్ప్లే సైజ్ 5.5 లేదా 6.1-అంగుళాలు ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఈ మోడల్ ఫుల్ స్క్రీన్ డిజైన్‌ తో వస్తుంది. ఫేస్ ఐడి సపోర్ట్ లేనందున నాచ్ ఏరియా చిన్నదిగా ఉంటుంది. టచ్ ఐడికి పవర్ బటన్‌తో కలిపి ఉంటుంది ”అని కుయో మాక్‌రూమర్స్ పొందిన పరిశోధన నోట్‌లో పేర్కొన్నారు.