Asianet News TeluguAsianet News Telugu

ఇక ఎయిర్‌టెల్ 3G సేవలు ఉండవ....?

భారతీ ఎయిర్‌టెల్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. 22 టెలికాం సర్కిల్‌ల ద్వారా అందిస్తున్న 3జీ సేవలను అంచెలంచెలుగా నిలిపివేయనున్నట్టు తెలిపారు. భారతీ ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విట్టల్‌ ఈ విషయాన్ని తానే స్వయంగా ధ్రువీకరించడం విశేషం. 

bharathi airtel ceo said 3g services will shutdown soon
Author
Hyderabad, First Published Nov 1, 2019, 2:44 PM IST

న్యూఢిల్లీ : ప్రముఖ దిగ్గజ టెలికాం సంస్థలో ఒకటయిన భారతీ ఎయిర్‌టెల్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. రిలయన్స్ జియో నుంచి పోటీని తట్టుకోలేపోతున్న ఎయిర్‌టెల్  ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో అందిస్తున్న 3జీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. 

also read తొలిసారి 108 ఎం​పీ​ కెమెరాతో షియోమీ నోట్​10!

భారతీ ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విట్టల్‌ ఈ విషయాన్ని తానే స్వయంగా ధ్రువీకరించారు. దీంతో 2జీ సేవల విషయంలో భారతీ ఎయిర్‌టెల్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని వినియోగదారుల్లో ఒక చిన్న ఆందోళన మొదలైంది. దీనిపై కూడా ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ స్పందించారు. 2జీ నెట్‌వర్క్ నుంచి రెవెన్యూ వస్తున్నంతకాలం 2జీ సేవలు కొనసాగిస్తామని తెలిపారు.

bharathi airtel ceo said 3g services will shutdown soon

అంతేకాకుండా 2జీ సేవలు పొందుతున్న వారికోసం ఎప్పటికప్పుడు రీఛార్జ్ ప్లాన్‌లను సవరిస్తూనే ఉంటామని వివరించారు. ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల దృష్ట్యా 2జీ నెట్‌వర్క్‌లను మాత్రం కొనసాగించనున్నట్లు వివరించారు. కలకత్తా ఎయిర్‌టెల్‌ 3జీ నెట్‌వర్క్‌ ఇప్పటికే నిలిపివేయగా, హరియాణాలో మాత్రం 3జీని ఎయిర్‌టెల్ సంస్థ నిలిపివేసింది. 

also read ఫ్లాగ్ షిప్ ఫోన్ రియల్ మీ ఎక్స్2 : 4 నుంచి ఫ్రీ ఆర్డర్లపై డెలివరీ

ఈ రెండు రాష్ట్రాలలో కూడా 2జీ, 4జీ సేవలను యథాతథంగా కొనసాగించనున్నట్లు తెలిపారు. 2020 మార్చి నాటికి దేశ వ్యాప్తంగా 3జీ సేవలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. 22 టెలికాం సర్కిల్‌ల ద్వారా అందిస్తున్న 3జీ సేవలను అంచెలంచెలుగా నిలిపివేయనున్నట్టు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios