న్యూఢిల్లీ: కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త మోడళ్లను విడుదల చేసే చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తాజాగా మరో సంచలన ఫీచర్లు గల స్మార్ట్​ఫోన్​ను​ విడుదల చేయడానికి సిద్ధమైంది. 

ఎంఐ నోట్ 10 పేరిట విడుదల చేయనున్న ఈ ఫోన్​లో 108 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, బ్యాకప్ ఐదు కెమెరాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నసమాచారం ప్రకారం దీని ధర రూ.28,999 ఉంటుందని భావిస్తున్నారు.

also read త్వరలో ఇండియాలోకి వాట్సాప్ పేమెంట్ అప్

ఎం​ఐ నోట్​ 10 పేరుతో మరో పవర్ హౌస్​ ఫోన్​ను మార్కెట్లోకి తేవడానికి రంగం సిద్ధం చేసింది షియోమీ. ప్రపంచంలోనే తొలిసారి 108 మెగా పిక్సల్ కెమెరాతో ఈ ఫోన్​ను తీసుకొస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 5న 'ఎంఐ సీసీ9 ప్రో'ను చైనాలో విడుదల చేయనున్నారు. 

దాని గ్లోబర్ వెర్షన్​ 'ఎం​ఐ నోట్​ 10' స్మార్ట్​ఫోన్​ను ఈనెల​ 14వ తేదీన పోలాండ్​లో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. భారత్​లో ఈ ఫోన్​ ఆవిష్కరణ తేదీ, వేదిక వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు వచ్చిన సర్టిఫికేషన్ లీక్స్ ప్రకారం ఈ రెండు స్మార్ట్​ఫోన్​లకీ ఒకే మోడల్​ నంబర్ ఉన్నట్లు టెక్​ నిపుణులు చెబుతున్నారు.

ఈ షియోమీ నూతన ఫోన్​లో 108 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, వెనుకవైపు 5 కెమెరాలు, 20 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, టెలిఫొటో లెన్స్, 12 మెగా పిక్సెల్ పొట్రెయిట్​ షూటర్​ ఉండే అవకాశం ఉంది. టెలిఫొటో లెన్స్​కు 10 ఎక్స్ హైబ్రీడ్​ జూమ్​, 50 ఎక్స్ డిజిటల్ జూమ్​ సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది.

also read ట్విటర్‌ సంచలన నిర్ణయం...తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఎం​ఐ సీసీ9 ప్రొలో క్వాల్​కాం స్నాప్​ డ్రాగన్ 730జీ ప్రాసెసర్​, ఎమ్​ఐ నోట్​ 10లో స్నాప్ ​డ్రాగన్​ 855 ప్లస్ ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. 6.47 అంగుళాల డిస్​ప్లే, 5170 ఎంఏహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీ, మూడు వేరియంట్లలోఈ స్మార్ట్​ఫోన్​ 6 జీబీ, 8 జీబీ, 12 జీబీ వేరియంట్లలో మార్కెట్లోకి విడుదల కావొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.

స్టోరేజీ సామర్థ్యం విషయానికి వస్తే 64 జీబీ, 128 జీబీ, 256 జీబీగా ఉండొచ్చు. నలుపు, ఎరుపు, నీలం, తెలుపు, గ్రే, పింక్, పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్​ అందుబాటులోకి రానున్నది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ ఫోన్ ధర రూ.28,999 ఉండవచ్చు. ఎంఐ సీసీ9 ప్రో ఫోన్‌కు ప్రతిరూపంగా షియోమీ మీ నోట్ 10 ఫోన్ ఉండనున్నది.