న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్ మీ’ కూడా ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఫోన్ మార్కెట్‌లోకి అడుగు పెడుతోంది. ఈ సెగ్మెంట్‌లో తన తొలి డివైస్‌ రియల్ మీ ఎక్స్‌ 2 ప్రొ ఫోన్ అని ఆ సంస్థ ప్రకటించింది. చైనా, తదితర మార్కెట్లలో ఈ నెల నాలుగో తేదీ నుంచి ప్రీ ఆర్డర్‌పై ఈ స్మార్ట్‌ఫోన్‌ లభిస్తుంది. బెల్జియం, ఫ్రాన్స్, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, పోలండ్, పోర్చుగల్, స్పెయిన్, బ్రిటన్ తదితర దేశాల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

also read హైదరాబాద్: స్పై వెర్ దాడులతో వాట్సాప్ కు హాని

భారత మార్కెట్‌లో మాత్రం ఈ నెల 20వ తేదీన రియల్ మీ ఎక్స్ 2 ప్రో ఫోన్‌ను ఆవిష్కరించనుంది. 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. భారత్‌లో డిసెంబర్ మొదటి వారంలో అమ్మకాలు ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది.

రియల్‌మీ ఎక్స్‌ 2 ప్రొ ఫోన్ 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 1080 x 2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌తోపాటు స్నాప్‌డ్రాగన్‌ 855 ప్లస్‌ సాక్‌ తదితర ఫీచర్లు ఉంటాయి. ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే వేలిముద్ర సెన్సార్‌, 50 వాట్ల వూక్‌ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. 

also read ఇక వాట్సాప్ ఆండ్రాయిడ్‌లో ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్‌

ఈ ఫోన్‌లో 64 +8+13+2  ఎంపీ రియర్‌ కెమెరా, 16ఎంపీ సెల్పీకెమెరా, 4000 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉంది. నెప్ట్యూన్ బ్లూ, లూనర్ వైట్ రంగుల్లో ఫోన్ వినియోగదారులకు లభించనున్నది.