Asianet News TeluguAsianet News Telugu

ఇలా ఈఎంవీ కార్డులతో మీ మనీకి భద్రత


మాగ్నటిక్ స్ట్రిప్ కార్డుల స్థానే వివిధ బ్యాంకులు జారీ చేస్తున్న ఈఎంవీ చిప్ కార్డులతో వినియోగదారుల మనీ సురక్షితంగా ఉంటుంది. మోసగాళ్లు స్వైప్ చేయడానికి వీల్లేకుండా యూరో పే, మాస్టర్ కార్డ్, వీసా సంస్థలు సంయుక్తంగా అభివ్రుద్ధి చేసిన కార్డే ‘ఈఎంవీ’ కార్డు.

All you want to know about EMV chip cards
Author
Mumbai, First Published Dec 31, 2018, 11:00 AM IST

ముంబై: బ్యాంకు ఖాతాదారులందరికీ పాత మాగ్నెటిక్‌ స్ర్టిప్‌ డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల చెల్లుబాటు రద్దయిపోయి ఈఎంవీ కార్డులు చలామణిలోకి రానున్నాయి. మంగళవారం (జనవరి 1) నుంచి పాతకార్డులు ఏ మాత్రం చెల్లవు. కొత్తకార్డులు లేని వారు ఎలాంటి లావాదేవీలు చేసుకునే వీలుండదు. అసలు ఈ రెండు రకాల కార్డులకు తేడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వాటిని పరిశీలిద్దాం..
 
‘యూరోపే, మాస్టర్‌కార్డ్‌, వీసా’ సంకేత నామమే ఈఎంవీ. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ మూడు కంపెనీలు కలిసి ఈ టెక్నాలజీ రూపొందించినందు వల్లే ఆ కార్డులకు ‘ఈఎంవీ’అనే పేరు పెట్టారు. కార్డుహోల్డర్లకు అదనపు రక్షణ కల్పించడం కోసం కొత్త కార్డుల్లో చిప్‌ ప్రవేశపెట్టారు. కార్డులను క్లోనింగ్‌, స్కిమ్మింగ్‌ చేయడం ద్వారా మోసపూరితమైన పనులు చేసే వారికి ఇవి చెక్‌ పెడతాయి.
 
పాత డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల్లో కార్డుహోల్డర్ల డేటా అంతా మాగ్నెటిక్‌ స్ర్టిప్‌లో నిక్షిప్తం అవుతుంది. దీని వల్ల వారు కార్డును స్వైప్‌ చేసిన తర్వాత ఆ డేటాను చౌర్యం చేసి మోసపూరితమైన లావాదేవీలకు పాల్పడే అవకాశం సైబర్‌ చోరులకు ఉంటుంది. అందుకు భిన్నంగా ఈఎంవీ కార్డులో సమాచారం అంతా దానిలో అమర్చే మైక్రోప్రాసెసర్‌ చిప్‌లో నిక్షిప్తం అవుతుంది. ప్రతీ లావాదేవీకి దానికే ప్రత్యేకమైన క్రిప్టోగ్రామ్‌ తయారవుతుంది గనుక దాన్ని కాపీ చేయడం గానీ, దుర్వినియోగం చేయడం గానీ ఎవరికీ సాధ్యం కాదు.
 
పైసా చేతిలో లేకుండా కొత్త సంవత్సరం ప్రారంభించకూడదనుకునే వారు పాత కార్డులు బ్యాంకుకు ఇచ్చి కొత్త ఈఎంవీ కార్డు తీసుకోవడానికి ఈ ఒక్క రోజే గడువు. ఆ తర్వాత కూడా కొత్త కార్డు తీసుకునే అవకాశం ఉన్నా పాత కార్డులు చెల్లుబాటు కోల్పోతాయి గనుక ఇక దానిపై ఎలాంటి లావాదేవీలకు అవకాశం ఉండదు. అందుకే త్వరపడండి. ఈ రోజే కార్డు మార్చుకోండి.

Follow Us:
Download App:
  • android
  • ios