యావత్ ప్రపంచంతో పాటే ఇండియాలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా డెవలప్ అవుతోంది. ఈ క్రమంలో దీన్ని విద్యారంగంలో ఎంత సమర్ధవంతంగా ఉపయోగించవచ్చో ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్ ఎడ్‌టాకీస్ వివరించింది.

అమెరికాకు చెందిన AI-ఆధారిత ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్ ఎడ్‌టాకీస్ (EdTalkies) ఇండియాలో విద్యావిధానం ఎలా మారుతుందో వివరించింది. ముఖ్యంగా దేశంలో డిజిటల్ లెర్నింగ్ భవిష్యత్ విద్యావిధానంలో ఇంకెన్ని మార్పులు తీసుకువస్తుందో అనేదానికి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అంతేకాదుగడిచిన ఆరేళ్లలో డిజిటల్ లెర్నింగ్ ఏ స్థాయిలో మార్పులకు లోనయ్యిందో ఎడ్‌టాకీస్ వివరించింది.

కరోనాకు ముందు డిజిటల్ లెర్నింగ్ కేవలం 20% వరకు మాత్రమే ఉండేది... అది కూడా ప్రధానంగా పట్టణ, ప్రైవేట్ విద్యా వ్యవస్థలకే పరిమితమైందని ఎడ్‌టాకీస్ పేర్కొంది. కానీ కోవిడ్ మహమ్మారి సమయంలో విద్యావ్యవస్థ కుంటుపడకుండా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగపడ్డాయని తెలిపింది. దీంతో20% కాస్త 70% కి చేరుకుంది... ప్రస్తుతం దేశం సుమారు 55% డిజిటల్ లెర్నింగ్ కొనసాగుతోందని పేర్కొంది.. ఇది హైబ్రిడ్ లెర్నింగ్ వైపు శాశ్వత మార్పును సూచిస్తోందని ఎడ్‌టాకీస్ అభిప్రాయపడుతోంది.

అయితే డిజిటల్ లెర్నింగ్ వృద్ధి అసమానంగా ఉంది... పట్టణ ప్రాంతాల్లో 70-85% వరకు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కేవలం 30-45% ఉందని తెలిపింది. పరిమిత ఇంటర్నెట్ సదుపాయం, వ్యక్తిగత పరికరాల కొరత, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ డిజిటల్ అక్షరాస్యత వంటి సవాళ్లు ఈ అంతరానికి ప్రధాన కారణంగా ఎడ్ టాకీస్ తెలిపింది. ఎడ్‌టాకీస్ ఈ సవాలును అధిగమించడానికి 'టీచర్ - క్రిటిక్(Teacher-centric) అనే విధానంతో కృత్రిమ మేథను (AI) పరిచయం చేస్తోంది. ఇది ఉపాధ్యాయులతో కలిసి పనిచేస్తూ, తరగతి గది వెలుపల కూడా వారి బోధనను విస్తరించడానికి రూపొందించబడింది.

"సాంకేతికత ఉపాధ్యాయుడి పాత్రను బలోపేతం చేయాలి కానీ దానిని విచ్ఛిన్నం చేయకూడదు. ప్రతి విద్యార్థి పాఠశాల గంటల తర్వాత కూడా తరగతి గదిలో నేర్చుకున్న విధంగానే క్రమబద్ధమైన రీతిలో అభ్యాసాన్ని కొనసాగించేలా చేయడమే మా లక్ష్యం" అని ఎడ్‌టాకీస్ వ్యవస్థాపకులు, సీఈవో రామ్ అల్లాడి తెలిపారు.

మీడియా సమావేశంలో ఉపాధ్యాయులు AIని ఉపయోగించి అకడమిక్ కంటెంట్‌ను ఎలా రూపొందించవచ్చో ఎడ్‌టాకీస్ ప్రదర్శించింది. జర్నలిస్టులు స్వయంగా ఎడ్‌టాకీస్ AI టీచర్ ఇంటర్‌ఫేస్ ను అనుభవించే అవకాశం కల్పించబడింది.