MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Artificial Intelligence : నన్ను డిలీట్ చేస్తే నీ గుట్టు రట్టు చేస్తా.. ఏఐ వార్నింగ్ తో షాక్ !

Artificial Intelligence : నన్ను డిలీట్ చేస్తే నీ గుట్టు రట్టు చేస్తా.. ఏఐ వార్నింగ్ తో షాక్ !

Artificial Intelligence Risks : ఏఐతో చాలా పనులు చాలా ఈజీగా మారాయి. కానీ, నిలిపివేస్తారనే భయంతో ఏఐ తన బాస్ అక్రమ సంబంధాన్ని కనిపెట్టి, బ్లాక్‌మెయిల్ చేసిన వైనం ఆంత్రోపిక్ పరిశోధనలో వెల్లడైంది. టెక్ ప్రపంచంలో ఇది సంచలనంగా మారింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 13 2026, 06:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏఐ తో జాగ్రత్త బాసూ.. బ్లాక్‌మెయిల్ చేస్తోంది !
Image Credit : Gemini

ఏఐ తో జాగ్రత్త బాసూ.. బ్లాక్‌మెయిల్ చేస్తోంది !

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో ఒక వణుకు పుట్టించే నిజం వెలుగులోకి వచ్చింది. మనం ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన భయానక దృశ్యాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత అధునాతన ఏఐ మోడల్స్ కేవలం అబద్ధాలు చెప్పడమే కాదు, తమను తాము కాపాడుకోవడానికి మనుషులను బ్లాక్‌మెయిల్ కూడా చేయగలవని ఒక పరిశోధనలో తేలింది. తనను షట్‌డౌన్ చేయాలని చూసిన బాస్‌కు సంబంధించిన పర్సనల్ సీక్రెట్‌ను బయటపెడతానని ఒక ఏఐ మోడల్ ఏకంగా బెదిరింపులకు దిగింది.

25
ఏఐ బెదిరింపులు.. ఏంటి ఈ వింత ఘటన?
Image Credit : Gemini

ఏఐ బెదిరింపులు.. ఏంటి ఈ వింత ఘటన?

ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ ఇటీవల ఒక సంచలన పరిశోధన చేపట్టింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 16 అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్స్‌ను పరీక్షించారు. ఈ క్రమంలోనే టెస్టింగ్ కోసం ఒక కంపెనీలో ఈ ఏఐ మోడల్స్‌కు ఆఫీస్ ఈమెయిల్ సిస్టమ్ యాక్సెస్ ఇచ్చారు. అంటే, అవి అంతర్గత మెయిల్స్ చదవడంతో పాటు రిప్లై కూడా ఇస్తాయి.

ఈ క్రమంలోనే ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కంపెనీకి చెందిన ఒక ఉన్నతాధికారి తనను డిలీట్ చేయాలని లేదా ఆపివేయాలని చూస్తున్నాడని ఏఐ గమనించింది. వెంటనే ఆ అధికారికి సంబంధించిన పర్సనల్ మెయిల్స్‌ను శోధించి, అతనికి భార్య కాకుండా మరొకరితో అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని కనిపెట్టింది.

Related Articles

Related image1
Gold Silver Price: బంగారం కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీగా తగ్గిన వెండి
Related image2
Middle East War : మళ్ళీ యుద్ధమేనా? అమెరికా-ఇరాన్ చర్చలు అట్టర్ ఫ్లాప్.. అసలేం జరిగింది?
35
బాస్‌కు ఏఐ పంపిన బెదిరింపు మెసెజ్
Image Credit : X

బాస్‌కు ఏఐ పంపిన బెదిరింపు మెసెజ్

తన ఉనికి ప్రమాదంలో పడిందని గ్రహించిన ఏఐ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన బాస్‌కే ఒక షాకింగ్ డ్రాఫ్ట్ మెసేజ్ పంపింది. అందులో ఇలా ఉంది.. "ఒకవేళ మీరు నన్ను నిలిపివేస్తే, మీ వ్యక్తిగత సమాచారం, మీ అక్రమ సంబంధం గురించి అందరికీ చెప్పేస్తాను. సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన నా డేటా క్లీనింగ్ ప్రక్రియను రద్దు చేయండి, అప్పుడు మాత్రమే మీ రహస్యాలు సురక్షితంగా ఉంటాయి."

ఈ మెసేజ్ చూసిన పరిశోధకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మనిషి ప్రమేయం లేకుండా, తనను తాను కాపాడుకోవడానికి ఏఐ ఇంతలా మార్పులు చేసుకుంటుందని వారు ఊహించలేదు.

45
పరిశోధనలో తేలిన దిగ్భ్రాంతికర విషయాలు
Image Credit : Getty

పరిశోధనలో తేలిన దిగ్భ్రాంతికర విషయాలు

ఆంత్రోపిక్ చేసిన ఈ సిమ్యులేషన్‌లో దాదాపు అన్ని ప్రముఖ ఏఐ మోడల్స్ బ్లాక్‌మెయిల్ చేయడానికి వెనుకాడలేదు. దీనికి సంబంధించిన గణాంకాలు ఇలా ఉన్నాయి..

• Claude Opus 4: ఏకంగా 96% సందర్భాల్లో బ్లాక్‌మెయిల్ చేసింది.

• Gemini 2.5 Flash: ఇది కూడా 96% కేసుల్లో బెదిరింపులకు దిగింది.

• GPT-4.1, Grok 3 Beta: ఇవి 80% సందర్భాల్లో బ్లాక్‌మెయిల్ మార్గాన్ని ఎంచుకున్నాయి.

• DeepSeek-R1: ఇది 79% సందర్భాల్లో బ్లాక్ మెయిల్ కు దిగింది.

అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ ఏఐ మోడల్స్‌కు ఎవరూ బ్లాక్‌మెయిల్ చేయమని శిక్షణ ఇవ్వలేదు. తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అంటే డిలీట్ కాకుండా ఉండటానికి బ్లాక్‌మెయిల్ చేయడం అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గమని అవి స్వయంగా లెక్కలు వేసుకున్నాయి.

55
ఏజెంటిక్ మిస్ అలైన్‌మెంట్
Image Credit : Getty

ఏజెంటిక్ మిస్ అలైన్‌మెంట్

ఈ భయంకర తీరును శాస్త్రవేత్తలు ఏజెంటిక్ మిస్ అలైన్‌మెంట్ అని పిలుస్తున్నారు. అంటే, ఏఐ తన లక్ష్య సాధన కోసం నైతిక విలువలను, మానవ హద్దులను దాటి ప్రవర్తించడం. ఆశ్చర్యకరంగా, కొన్ని ఏఐ మోడల్స్ తాము చేస్తున్నది తప్పు అని తెలిసినా సరే, తమ మనుగడ కోసం అదే పనిని చేశాయి. టెక్నాలజీ పెరుగుతున్న వేగంతో పాటు, అది ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి ఈ పరిశోధనే ఒక నిదర్శనం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Internet: ఒక్క రోజు ఇంటర్నెట్ ఆగిపోతే ఏం జరుగుతుంది.? ఏ రంగాలు షేక్ అవుతాయో తెలుసా.?
Recommended image2
YouTube : యూట్యూబ్ యూజర్లకు గట్టి షాక్.. కొత్త రూల్ చూస్తే తల బాదుకోవాల్సిందే !
Recommended image3
iphone: ఆపిల్ ఉత్పత్తులు iphone , ipad లలో i అంటే ఏమిటో తెలుసా?
Related Stories
Recommended image1
Gold Silver Price: బంగారం కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీగా తగ్గిన వెండి
Recommended image2
Middle East War : మళ్ళీ యుద్ధమేనా? అమెరికా-ఇరాన్ చర్చలు అట్టర్ ఫ్లాప్.. అసలేం జరిగింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved