Weather: ఆంధ్రలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హెచ్చరికలు
Apr 20 2025, 06:50 AM ISTAndhra Pradesh Rains: ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశమున్నట్లు తెలిపింది. అలాగే, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్న హెచ్చరికలు జారీ చేసింది.