మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో భారత్ చేతిలో ఓటమిపై స్పందించాడు ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్. అనుభవరహిత్యం కారణంగానే తాము ఓడిపోయామన్నాడు.. పెర్త్ విజయం మరోసారి పునరావృతమవుతుందని భావించాను... కానీ బ్యాటింగ్ లైనప్ అనుభవరహిత్యం తీవ్రంగా నష్టపరిచిందని టీమ్ అన్నాడు.

ప్రపంచంలోనే దిగ్గజ పేస్ అటాక్ ఉన్న జట్టుతో ఆడుతున్నామని.. కానీ తమ జట్టులో టాప్-6 బ్యాట్స్‌మెన్ అనుభవం లేనివారేనని పైన్ అభిప్రాయపడ్డాడు. తమ ఆటగాళ్లు వారి శక్తి మేరకు కష్టపడ్డారని, సిడ్నీ టెస్ట్ మాకు పెద్ద పరీక్ష అని, తప్పకుండా గెలిచి సిరీస్ కాపాడుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మెల్‌బోర్న్‌లో భారత్ అద్భుతంగా ఆడిందని.. అలాగే కమిన్స్ బాగా ఆడాడని ప్రశంసించాడు. ఈ ఏడాది ఆసీస్‌కు బాగానే గడిచిందని, ప్రపంచ స్థాయి ఆటగాళ్లు జట్టులోకి వస్తున్నారని చెప్పాడు. అలాగే కోహ్లీ మాట్లాడుతూ.. ఈ విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని...రెట్టించిన ఉత్సాహంతో సిడ్నీ టెస్టులో ఆడతామన్నాడు.

ఆసీస్ గడ్డపై తమ పని ఇంకా ముగియలేదని ఆఖరి టెస్టులో విజయం సాధించాల్సి ఉందన్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా చివరిదైనా నాలుగో టెస్ట్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.

మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా రికార్డుల మోత

బుమ్రా దెబ్బ: ఇండియా చేతిలో ఆస్ట్రేలియా చిత్తు

వరల్డ్ కప్‌ జట్టు ఎంపికపై కోహ్లీ సూచన...వ్యతిరేకించిన ధోనీ

ఆరంగేట్ర మ్యాచ్‌లో మయాంక్ అదిరిపోయే రికార్డు...సునీల్ గవాస్కర్ తర్వాత

పైన్ పై రిషబ్ పంత్ ప్రతీకారం: వెన్నెల కిశోర్ స్పందన

అంబటి రాయుడిని చూసి భయపడిన ధోనీ