Asianet News TeluguAsianet News Telugu

కామన్వెల్త్ గేమ్స్‌‌లో ఇండియా.. 1998 నుంచి 2022 వరకు ఏడు ఎడిషన్స్‌‌లొ ఫర్మామెన్స్ ఎలా ఉందంటే..

కామన్వెల్త్ గేమ్స్‌లో ‌భారత్ ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. పతకాల పట్టికలో భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. అయితే 1998 నుంచి 2022 వరకు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ప్రదర్శన ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం.. 

take a look India performance in the 1998 to 2022 CWG editions
Author
First Published Aug 8, 2022, 10:35 PM IST

మొట్టమొదట కామన్వెల్త్ గేమ్స్‌‌ను 1930లో కెనడాలోని హ్యామిల్టన్‌లో నిర్వహించారు. అప్పుడు మొత్తం 11 దేశాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఒకప్పుడు గ్రేట్ బ్రిటన్‌కు వలసలుగా ఉన్న దేశాల సముదాయమే కామన్వెల్త్‌. భారత్ 1934 సెకండ్ ఎడిషన్‌లో కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంది. ఆ సమయంలో ఒక క్యాంస పతకం మాత్రమే సాధించింది. తొలుత కొన్ని ఒడిదుడుకులైన.. భారత తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటూ వస్తుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో ‌భారత్ ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. పతకాల పట్టికలో భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ మొత్తంగా 61 పతకాలు సాధించగా.. అందులో  22 స్వర్ణాలు, 16 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. భారత్ వేదికగా జరిగిన  ఆ ఎడిషన్‌లో భారత్ మొత్తం 101 పతకాలు సొంతం చేసుకుంది. అయితే 1998 నుంచి 2022 వరకు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ప్రదర్శన ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం.. 

1998 కామన్వెల్త్ గేమ్స్, వేదిక- కౌలాలంపూర్
1998 కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలు 20వ శతాబ్దపు చివరిది. అయితే ఆసియా దేశంలో జరిగిన మొదటిది. క్రికెట్, హాకీ వంటి మరికొన్ని క్రీడలు కామన్వెల్త్ గేమ్స్‌లో మొదటిసారిగా చేర్చబడ్డాయి. భారత క్రికెట్ జట్టుకు అజయ్ జడేజా నాయకత్వం వహించారు. అప్పుడు జట్టులో సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలు ఉన్నారు. అయితే భారత జట్టు సెమీస్‌కు చేరుకోలేకపోయింది. భారత పురుషుల హాకీ జట్టు.. సెమీఫైనల్‌కు చేరుకుంది. కానీ అక్కడ మలేషియా చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత కాంస్య పతక మ్యాచ్‌లో పెనాల్టీలో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. ఈ ఎడిషన్‌లో మొత్తం మీద భారత్ 25 పతకాలతో (7 స్వర్ణాలు, 10 రజతాలు, 8 కాంస్యాలు) పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. 

2002 కామన్వెల్త్ గేమ్స్, వేదిక-మాంచెస్టర్
2002 కామన్వెల్త్ గేమ్స్‌లో గత ఎడిషన్‌ కంటే భారత్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. భారత ఆటగాళ్లు మొత్తం 69 పతకాలు సాధించారు. ఇందులో 30 స్వర్ణాలు, 22 రజతాలు, 17 కాంస్యాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. సూరజ్ లత దేవి నేతృత్వంలోని భారత మహిళా హాకీ జట్టు ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను  ఓడించి.. పసిడి సొంతం చేసుకుంది. అది కాకుండా షూటింగ్‌లో 14 స్వర్ణాలు, వెయిట్ లిఫ్టింగ్‌లో 11 స్వర్ణాలు, రెజ్లింగ్‌లో 3 స్వర్ణాలు, బాక్సింగ్‌లో ఒక స్వర్ణం భారత్ కైవసం చేసుకుంది. 

2006 కామన్వెల్త్ గేమ్స్, వేదిక- మెల్‌బోర్న్
2006 కామన్వెల్త్ గేమ్స్‌‌ పతకాల పట్టికలో భారత్ మరోసారి నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ మొత్తం 50 పతకాలు సాధించగా.. అందులో 22 స్వర్ణాలు, 17 రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. భారత షూటర్స్ మొత్తం 16 పసిడి పతకాలు సాధించారు. ఇక, వెయిట్ లిఫ్టర్స్ 3 గోల్డ్, టేబుల్ టెన్నిస్‌లో 2 గోల్డ్, బాక్సింగ్‌లో 1 గోల్డ్ మెడల్ భారత్ సొంతం చేసుకుంది.  

ఈ ఎడిషన్‌లో భారత షూటర్ సమ్రేష్ జంగ్ ప్రారంభ డేవిడ్ డిక్సన్ అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డుతో ప్రతి ఎడిషన్‌లో అత్యుత్తమ అథ్లెట్‌ను సత్కరిస్తారు. అలాగే సమ్రేష్ జంగ్ మూడు కొత్త సీడబ్ల్యూజీ రికార్డులను నెలకొల్పారు. 5 బంగారు, 1 రజతం, 1 కాంస్యంతో సహా 7 పతకాలను గెలుచుకున్నారు.

2010 కామన్వెల్త్ గేమ్స్, వేదిక- న్యూఢిల్లీ
కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ వేదికగా నిలవడం ఇదే తొలిసారు. సొంత గడ్డపై జరిగిన ఈ ఎడిషన్‌లో భారత జట్టు మొత్తంగా 101 పతకాలు సాధించింది. అందులో 38 స్వర్ణం, 27 రజతం, 36 క్యాంసం ఉన్నాయి. ఆ ఎడిషన్ పతకాల పట్టికలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. పసిడి పతకాల విషయానికి వస్తే.. భారత షూటర్లు 14, రెజర్లు 10, ఆర్చర్స్ 3, బాక్సర్స్ 3, అథ్లెటిక్స్‌లో 2, వెయిట్ లిఫ్టింగ్‌లో 2, బ్యాడ్మింటన్ 2, టెబుల్ టెన్నిస్ 1, లాన్ టెన్నిస్‌లో 1 ఉన్నాయి.

2014 కామన్వెల్త్ గేమ్స్, వేదిక- గ్లాస్గో
2014 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథెట్స్ కొందరు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. 56 ఏళ్లలో తొలిసారిగా ఇండియాకు మెన్స్ అథ్లెటిక్స్‌లో వికాస్ గౌడ(మెన్స్ డిస్కస్) గోల్డ్ మెడల్ సాధించి పెట్టారు. ఇంకా చాలా మంది తమ ఉత్తమమైన ప్రదర్శనను ఇచ్చారు. మొత్తంగా ఈ ఎడిషన్‌లో ఇండియా 64 మెడల్స్ సాధించగా.. అందులో 15 స్వర్ణం, 30 రజతం, 19 కాంస్యం ఉన్నాయి. భారత రెజర్లు 5 స్వర్ణాలు, షూటర్స్ 4 స్వర్ణాలు, వెయిట్ లిఫ్టర్స్ 3 స్వర్ణాలు, అథ్లెటిక్స్, స్క్వాష్, బ్యాడ్మింటన్‌లలో ఒక్కో స్వర్ణం ఉన్నాయి. 

2018 కామన్వెల్త్ గేమ్స్, వేదిక- గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా
2018 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 66 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో భారత్ మూడో స్థానంలో నిలచింది. ఇందులో 26 స్వర్ణం, 20 రజతం, 20 కాంస్యం ఉన్నాయి. ఆ ఎడిషన్‌లో భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. గోల్డ్ మెడల్స్ విషయానిక వస్తే.. shooters 7, వెయిట్ లిఫ్టర్స్ 5, రెజర్ల్స్ 5, బాక్సర్స్ 3, paddlers 3, బ్యాడ్మింటన్ 2, అథ్లెటిక్స్ ఒకటి ఉన్నాయి. 

2022 కామన్వెల్త్ గేమ్స్, వేదిక-బర్మింగ్‌హామ్‌
2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జట్టు మొత్తం పతకాలు గెలుచుకుంది. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో గెలిచింది. భారత్ సాధించిన పతకాల్లో.. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో మొత్తం 61 పతకాలు ఉన్నాయి. అయితే గత ఎడిషన్‌తో పోలిస్తే మాత్రం భారత్‌కు ఈసారి నిరాశే ఎదురైందని చెప్పుకోవాలి. ఈసారి ఎడిషన్‌లో షూటింగ్ లేకపోవడం.. భారత్ పతకాలు తగ్గడానికి ముఖ్యమైన కారణం కూడా ఒకటి ఉంది. షూటింగులో ప్రతిసారి చెప్పుకొదగ్గ స్థాయిలో పతకాలు వస్తున్నాయి. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు షూటింగ్‌లో 7 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలు వచ్చాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios