ఇన్నాళ్లు రాకెట్ పట్టుకుని క్రీడాకారిణీగా విజయాలను రుచి చూసిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ఇప్పుడు అమ్మగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. సానియా-షోయాబ్ మాలిక్ దంపతులకు గత నెలలో ఓ బాబు జన్మించిన సంగతి తెలిసిందే.

ఈ చిన్నారికి ఇజాన్ మీర్జా మాలిక్ అని నామకరణం కూడా చేశారు. బిడ్డ పుట్టిన నాటి నుంచి నేటి వరకు అందరి ప్రముఖుల్లాగానే అభిమానులకు పరిచయం చేస్తూ వస్తున్నారు సానియా, మాలిక్‌. ఈ క్రమంలో ఇవాళ మరో ఫోటోను షేర్ చేసింది సానియా.

ఇజాన్ అని రాసి ఉన్న బుల్లి జాకెట్‌ను చిన్నారికి కప్పి.. బాబును ఎత్తుకుని ఉన్న ఫోటోను సానియా మీర్జా తన ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అప్పుడే దీనిని 23 వేల మందికి పైగా అభిమానులు షేర్ చేసి.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

 

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియా.. షోయబ్ ట్వీట్ 

పాకిస్థానీలు.. నన్ను వదినా అని పిలుస్తారు.. సానియా

గర్భవతిగా ఉండికూడా సానియామిర్జా ఏం చేసిందో తెలుసా?

నేను తల్లిని కాబోతున్న: ట్విట్టర్ లో సానియా మీర్జా క్యూట్ పోస్ట్

భారత్, పాక్‌లలో ఎవరికి సపోర్ట్ చేస్తారన్న నెటిజన్.. ట్విట్టర్‌కు టాటా చెప్పిన సానియా

భర్తపై జర్నలిస్టు చెత్త కామెంట్: "అరే, బెచారా" అంటూ సానియా రిప్లై