గర్భవతిగా ఉండికూడా సానియామిర్జా ఏం చేసిందో తెలుసా?

Sania practises prenatal yoga, gets praise from Maneka Gandhi
Highlights

ఈ రోజే కాదు... ప్రతిరోజూ చేస్తుంటానన్న సానియా

అంతర్జాతీయ టెన్నిస్ లో భారత్ నుండి ప్రాతిసిధ్యం వహిస్తూ దేశ గౌరవాన్ని నిలబెట్టారు సానియా మీర్జా. ఈ హైదరాబాదీ సుందరి పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే సానియా మీర్జా ఇటీవలే గర్భం దాల్చింది. ఇలా గర్భవతిగా ఉండి కూడా తాను నిత్యం యోగా చేస్తుంటానని, అదే తాను ఆరోగ్యంగా ఉండేలా చూస్తుందంటూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సానియా ట్వీట్ చేశారు.  

 

‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవమైనా లేదా ఏ రోజైనా నేను యోగా చేస్తుంటాను. అలాగే ఈ గర్భధారణ సమయంలోనూ నేను యోగా వీడలేదు. అందువల్లే గర్భవతిగా ఉండి కూడా ఇంత ఫిట్ ఉండగలిగాను. మరి మీరు ఇలాగే యోగా చేస్తున్నారా’’ అంటూ ట్వట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు తాను ప్రస్తుతం యోగా చేస్తున్న ఫోటోలను సానియా జతచేశారు.

ఈ ట్వీట్ ను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖతో పాటు ఆ శాఖా మంత్రి మేనకా గాంధీ కి ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ పై మంత్రి కూడా స్పందిస్తూ ''వండర్‌ఫుల్ సానియా...గర్భధారణ సమయంలో యోగా చేయడం వల్ల ఫిట్ గా ఉంటారు'' అంటూ ప్రశంసించారు.  

 

 

 

loader