నేను తల్లిని కాబోతున్న: ట్విట్టర్ లో సానియా మీర్జా క్యూట్ పోస్ట్

First Published 23, Apr 2018, 7:10 PM IST
Sania Mirza Is Pregnant: Announces on Twitter
Highlights

నేను తల్లిని కాబోతున్న: ట్విట్టర్ లో సానియా మీర్జా క్యూట్ పోస్ట్

హైదరాబాద్: హైదరాబాదు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. త్వరలోనే తమ జీవితంలోకి ఓ బేబీ రాబోతున్నట్లు తెలిపింది. 

బేబీ మీర్జా మాలిక్ అనే హ్యాష్ ట్యాగ్ తో తాను గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. దీంతో అభిమానులు అభినందలు తెలియజేస్తున్నారు. సానియా మీర్జా 2010లో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 

తాను ఈ రోజు తమ కుటుంబ రహస్యం చెప్పాలని అనుకుంటున్నానని, తమకు సంతానం ఎప్పుడు కలిగినా వారి పేర్లలో తమ ఇంటి పేరు వచ్చేలా మీర్జా మాలిక్ ను జోడించాలని తాను, తన భర్త నిర్ణయించుకున్నామని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. షోయబ్ మాలిక్ తనకు అమ్మాయి కావాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపింది.
 

loader