మను భాకర్ సంచలనం.. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు రెండో మెడల్

Paris Olympics 2024 : కాంస్య పతక విజేత మను భాకర్, సరబ్జోత్ సింగ్ మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ కాంస్య పతక మ్యాచ్‌లో కొరియాతో పోటీ ప‌డ్డారు. 
 

Paris Olympics 2024 : Manu Bhaker and Sarabjot Singh won the bronze medal for India in the mixed 10m air pistol event RMA

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్  2024 లో భారత్ రెండో మెడల్ గెలుచుకుంది. షూటింగ్ విభాగంలో మరో కాంస్య పతకం సాధించింది. కాంస్య పతక విజేత మను భాకర్, సరబ్జోత్ సింగ్ మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ కాంస్య పతక మ్యాచ్‌లో కొరియాతో పోటీ ప‌డ్డారు. ఈ పోటీలో కొరియాను ఓడించి భారత్ కాంస్య పతకం సాధించింది.  భారత జోడీ 16 పాయింట్లు సాధించగా, కొరియా జోడీ 10 పాయింట్లు మాత్రమే సాధించింది. మను భాకర్ ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కాంస్యం గెలుచుకుంది. భారత స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ అథ్లెట్ గా రికార్డు  సాధించింది.

 

 

 

ఎవ‌రీ మ‌ను భాక‌ర్? 

భార‌త స్టార్ షూట‌ర్ల‌లో మ‌ను భాక‌ర్ ఒక‌రు. యుక్తవయసులోనే అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో త‌క్కువ కాలంలోనే షూటింగ్ స్టార్‌గా త‌న‌ ర్యాంక్‌లను పెంచుకున్నారు. బాక్సర్లు, రెజ్లర్‌లకు పేరుగాంచిన హర్యానాలోని ఝజ్జర్‌లో జన్మించిన మను భాకర్ పాఠశాలలో టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ వంటి క్రీడలను ఎంచుకున్నారు. ఆమె 'తంగ్ టా' అనే మార్షల్ ఆర్ట్స్‌లో పాల్గొని జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది.

2016 రియో ​​ఒలింపిక్స్ ముగిసిన తర్వాత త‌న‌ 14 సంవత్సరాల వయస్సులో షూటింగ్‌లోకి మారింది. ఒక వారంలోపు మను భాకర్ తన నైపుణ్యాన్ని పెంచుకోవ‌డానికి స్పోర్ట్స్ షూటింగ్ పిస్టల్‌ని తీసుకురావాలని ఆమె తండ్రిని కోరింది. ఆమెకు ఎప్పుడూ మద్దతునిచ్చే తండ్రి రామ్ కిషన్ భాకర్ ఆమెకు స్పోర్ట్స్ షూటింగ్ పిస్టల్‌ని కొనిచ్చాడు. ఏదో ఒక రోజు మ‌ను భాక‌ర్ ను ఈ పిస్ట‌ల్ ఒలింపిక్ ఛాంపియ‌న్ గా మారుస్తుంద‌ని ఆకాంక్షించారు. 

త‌న తండ్రి క‌ల‌ల‌ను నిజం చేస్తూ మ‌ను భాక‌ర్ అతి త‌క్కువ కాలంలోనే స్టార్ షూట‌ర్ గా ఎదిగారు. 2017 జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మను భాకర్ ఒలింపియన్, మాజీ ప్రపంచ నంబర్ 1 హీనా సిద్ధూకు షాకిచ్చారు. మను భాక‌ర్ 242.3 రికార్డు స్కోరుతో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సిద్ధూ సాధించిన మార్కును అధిగమించారు. ఆ తర్వాత 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లలో రజత పతకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు రెండోసారి ఒలింపిక్ వేదిక‌పై పోటీ ప‌డుతూ రెండు బ్రాంజ్ మెడ‌ల్స్ సాధించింది.

అంత‌ర్జాతీయ క్రికెట్ లో ఒకే ఒక్క‌డు.. య‌శ‌స్వి జైస్వాల్ మ‌రో రికార్డు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios