Paris Olympics 2024 :  పారిస్ ఒలింపిక్స్ 2024 లో తొలి గోల్డ్ మెడ‌ల్ ను చైనా గెలుచుకుంది.  గోల్డ్ మెడ‌ల్ కోసం చైనా, సౌత్ కొరియాలు హోరాహోరీగా త‌ల‌ప‌డ్డాయి. 

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024 లో శ‌నివారం భారత్ అనేక క్రీడలలో పోటీ ప‌డుతోంది. అయితే, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ షూటింగ్‌లో భారత జట్టు నిరాశ‌ప‌రిచింది. మెడ‌ల్ రౌండ్ కు క్వాలిఫై కాలేక‌పోయింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో చైనా తొలి బంగారు పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో హువాంగ్ యుటింగ్, షెంగ్ లిహావో 16-12తో కొరియా జోడీని ఓడించి స్వర్ణం సాధించారు. ఈ ఈవెంట్‌లో కొరియా రజతం గెలుచుకుంది. కజకిస్తాన్ కాంస్యం గెలుచుకుంది.

ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ విభాగంలో టాప్ 4 లోకి చైనా, ద‌క్షిణ కొరియా, క‌జ‌కిస్తాన్, జ‌ర్మ‌నీలు వెళ్లాయి. కాంస్య ప‌త‌కం కోసం క‌జ‌కిస్తాన్, జ‌ర్మ‌నీలు పోటీ ప‌ట్టాయి. ఇక్క‌డ క‌జ‌కిస్తాన్ మొద‌టి రౌండ్ నుంచి అధిప‌త్యం ప్ర‌ద‌ర్శించి కాంస్యం సొంతం చేసుకుంది. గోల్డ్ మెడ‌ల్ కోసం చైనా, ద‌క్షిణ కొరియాలు హోరాహోరీగా పోటీ ప‌డ్డాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ టీమ్ విభాగంలో లిహావో షెంగ్- యుటింగ్ హువాంగ్ జోడీ 16-14తో దక్షిణ కొరియా జోడీ జిహియోన్ కీమ్- హజున్ పార్క్ జంటపై విజయం సాధించింది.

Scroll to load tweet…

భార‌త్ కు మ‌ళ్లీ నిరాశే.. 

పారిస్ ఒలింపిక్స్ 2024 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మెడ‌ల్ రౌండ్లలోకి ప్రవేశించడంలో భారత్ విఫలమైంది. రమిత (314.5), అర్జున్ (314.2) మొత్తం 628.7తో 6వ స్థానంలో నిలవగా, ఎలవెనిల్ (312.6), సందీప్ (313.7) జంట మొత్తం 626.3తో ముగిసింది. 

Scroll to load tweet…


అత్యంత ఖరీదైన టాప్-5 ఒలింపిక్స్ ఇవే..