MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • అత్యంత ఖరీదైన టాప్-5 ఒలింపిక్స్ ఇవే..

అత్యంత ఖరీదైన టాప్-5 ఒలింపిక్స్ ఇవే..

top 5 most expensive Olympics: ఒలింపిక్స్‌కు పారిస్‌ దాదాపు $9.7 బిలియన్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. ప్పటి వరకు అత్యంత ఖరీదైన స‌మ్మ‌ర్ ఒలింపిక్స్ రియో ​​డి జనీరో 2016. దీని కోసం $23 బిలియ‌న్లు ఖ‌ర్ఛు చేశారు. అయితే, మొత్తం హిస్టరీని గమనిస్తే ఒలింపిక్స్ చరిత్రతో అత్యంత ఖరీదైన టాప్‍‍-5 ఒలింపిక్స్ వివ‌రాలు ఇలా ఉన్నాయి..  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 27 2024, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

1. రియో ​​డి జనీరో-2016

రియో ​​డి జనీరో-2016లో నిర్వహించిన విశ్వక్రీడలు అత్యంత  ఖరీదైన స‌మ్మ‌ర్ ఒలింపిక్ గేమ్స్. ఇక్క‌డ నిర్వ‌హించిన ఒలింపిక్ గేమ్స్ కోసం $23 బిలియ‌న్లు ఖ‌ర్చు చేశారు.  ఒలింపిక్స్‌ను నిర్వహించే హక్కులను గెలుచుకున్న తర్వాత ఈ న‌గ‌రం కీల‌క‌మైన మూడు ప్రజా రవాణా మార్గాల‌ను అభివృద్ధి చేసింది. అవి బస్ రాపిడ్ ట్రాన్సిట్ (BRT), మెట్రో, లైట్ వెహికల్ రైల్ సిస్టమ్. 2016 ఆగ‌స్టు 5 నుంచి 21 వ‌ర‌కు దక్షిణ అమెరికాలో ప్రఖ్యాత బ్రెజిలియన్ నగరం తొలిసారిగా విశ్వ‌క్రీడ‌ల‌ను  నిర్వహించింది. ఈ నగరం ఒలింపిక్ చరిత్రలో క్రీడలను నిర్వహించడానికి అత్యధిక డబ్బును ఖర్చు చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

2. లండన్ - 2012

లండన్ 2012 స‌మ్మ‌ర్ ఒలింపిక్స్ కోసం $16.8 బిలియ‌న్ల‌ను ఖ‌ర్చు చేశారు. దీంతో ఒలింపిక్ హిస్ట‌రీలో అత్యంత ఖ‌రీదైన గేమ్స్ లో రెండో స్థానంలో ఉన్నాయి. ఒలింపిక్స్ క్ర‌మంలో లండన్ పది కొత్త రైల్వే లైన్‌లు, 30 కొత్త వంతెనలను నిర్మించింది. లండన్ అంతటా పాదచారులు, సైక్లింగ్ మార్గాలను అప్‌గ్రేడ్ చేయడానికి కూడా భారీగా ఖ‌ర్చు చేసింది. లండ‌న్ ఒలింపిక్స్ 27 జూలై నుంచి 12 ఆగస్టు 2012 వ‌ర‌కు జ‌రిగాయి.

35
Tokyo, Japan

Tokyo, Japan

3. టోక్యో - 2020

టోక్యో 2020 ఒలింపిక్స్ మూడవ అత్యంత ఖరీదైన స‌మ్మ‌ర్ ఒలింపిక్ క్రీడ‌లు. దీని కోసం చైనా  $13.7 బిలియ‌న్ల‌ను ఖ‌ర్చు చేసింది. ప్రారంభ, ముగింపు వేడుకల కోసం కొత్త జాతీయ ఒలింపిక్ స్టేడియంతో సహా, క్రీడల కోసం ప్రత్యేకంగా ఎనిమిది కొత్త వేదికలను నిర్మించ‌డం కోసం భారీగా ఖ‌ర్చు చేసింది. 

45

4. బార్సిలోనా - 1992

బార్సిలోనా 1992 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ 4వ‌ అత్యంత ఖరీదైన ఒలింపిక్ గేమ్స్. ఈ క్రీడ‌ల కోసం  $11.6 బిల‌య‌న్ల‌ను ఖ‌ర్చు చేసింది. బార్సిలోనా విమానాశ్రయ విస్తరణ, కొత్త రింగ్ రోడ్ల వ్యవస్థ, కొత్త హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌తో సహా ప్రజా రవాణా, కొత్త వేదికల కోసం భారీగా ఖర్చు చేసింది. 

55

5. పారిస్ - 2024

విశ్వ‌క్రీడ‌ల హిస్ట‌రీలో 5వ అత్యంత ఖరీదైన స‌మ్మ‌ర్ ఒలింపిక్స్ పారిస్ 2024. పారీస్ ఈ ఒలింపిక్స్ కోసం ఫ్రాన్స్ దాదాపు  $8.7 బిలియ‌న్ల నుంచి  $9.7 బిలియన్లు ఖ‌ర్చు చేస్తోంది. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved