పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ జర్నలిస్ట్‌కు శ్రీలంక వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్వెల్లా దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు.  పాక్  జర్నలిస్ట్‌లు ఆయనను బాట్స్ మెన్ డి సిల్వా గా పోరబడి ప్రశ్నలు అడగడంతో విస్తుపోయారు. తను  డి సిల్వా కాదని డిక్వెల్లాన్ని చెప్పినప్పటికీ మరో సారి డి సిల్వా పేరుతో ప్రశ్న అడగడంపై వారికి ఆయన సరదా సమాధానమిచ్చాడు.

పాక్,శ్రీలంక మధ్య   రావల్పిండి క్రికెట్ స్టేడియంలో  మెుదటి టెస్ట్ మ్యాచ్ జరగుతున్న విషయం తెలిసిందే. మెుదటిగా  ఆతిథ్య   శ్రీలంక జట్టు బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు ఆట ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. మ్యాచ్ అనంతరం ఏర్ఫాటు చేసిన విలేకర్ల సమావేశంలో లంక క్రికెటర్‌ నిరోషన్‌ డిక్వెల్‌ విలేకరులతో మాట్లాడాడు. సమావేశంలో ఓ  విలేకరి మాట్లాడుతూ "మీరు బ్యాటింగ్ చాలా బాగా ఆడారు. సెంచరీకి దగ్గరలోకి వచ్చారు.  శతకం సాధిస్తానని మీరు అనుకుంటున్నారా" అని డిక్వెల్‌ను అడిగాడు.

ఆ ప్రశ్నకు నవ్వుకున్న డిక్వెల్‌ సమాధానం ఇస్తూ "నేను డిసిల్వాను కాదు. డిక్వెల్‌ను అంటూ బదులిచ్చాడు". ఆయన అలా చెప్పనప్పటికి మరో జర్నలిస్ట్ ఇలాంటి ప్రశ్ననే సంధించాడు. దానికి విస్తూపోయిన డిక్వెల్‌ ఓపిగ్గా సమాధానం ఇచ్చాడు. "మీరు ఎవరు గురించి మాట్లాడుతున్నారు.నేను డి సిల్వా కాదు,  ఇప్పటికే ఔట్‌ అయ్యాను .రెండో ఇన్నింగ్స్‌లో అన్ని అనుకూలిస్తే సెంచరీ చేస్తా"నని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. కనీస అవగాహన లేకుండా జర్నలిస్ట్‌లు ఆ సమావేశంలో ఎలా పాల్గోంటారని  నెటిజన్లు  ట్రోల్స్ చేస్తున్నారు.