Asianet News TeluguAsianet News Telugu

Neeraj Chopra: శక్తి మోహన్ కు ప్రపోజ్ చేసిన నీరజ్ చోప్రా.. డాన్స్ తో ఇరగదీశాడుగా.. వీడియో వైరల్

Neeraj Chopra: ఓ డాన్స్ షో కు ప్రత్యేక అతిథిగా వచ్చిన ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా.. అక్కడ ఓ వర్ధమాన బాలీవుడ్ నటికి ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది. 

neeraj chopra proposes to shakthi mohan on dance plus 6 show video goes viral
Author
Hyderabad, First Published Sep 28, 2021, 5:06 PM IST

వందేండ్ల భారత ఒలింపిక్ చరిత్రలో అథ్లెటిక్స్ లో దేశానికి స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా ఓ డాన్స్ రియాలిటీ షోలో తళుక్కున మెరిశాడు. పంజాబీ పాటకు స్టెప్పులేయడమే గాక ఆ షోలో  ఓ టీమ్ కు కెప్టెన్ గా ఉన్న  బాలీవుడ్  అప్ కమింగ్ యాక్ట్రెస్ శక్తి మోహన్ (shakthi mohan) కు ప్రపోజ్ చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

స్టార్ ప్లస్ (star plus), డిస్నీ హాట్ స్టార్ లో వస్తున్న డాన్స్ ప్లస్ 6 (dance plus 6) ఉత్తరాదిలో ఒక సంచలనం.  తాజాగా ఈ షోకు నీరజ్ గెస్ట్ గా వచ్చాడు.  అయితే ఇందులో ఒక టీమ్ కెప్టెన్ గా ఉన్న శక్తి మోహన్ కు మరో టీమ్ లీడర్ రాఘవ్ శక్తి (raghav shakthi) ప్రపోజ్ చేశాడు. దాంతో శక్తి.. నీరజ్ ను అలా చేయాలని అడిగింది. స్టేజ్ పైకి వచ్చిన చోప్రా.. ‘నా జీవితంలో అతి ముఖ్యమైన విషయం జావెలిన్.. నేను వంట బాగా చేయలేను. నేను మీకు ఎక్కువ సమయం ఇవ్వలేను..’అంటూ తనదైన శైలిలో ప్రపోజ్ చేశాడు.

 

దీంతో వెంటనే అక్కడే ఉన్న రాఘవ్.. ‘భాయ్.. మీరు జావెలిన్ ను తప్పుడు ప్రదేశంలో విసిరారు..’ అని అన్నాడు. దీంతో అక్కడ నవ్వులు విరబూసాయి. అనంతరం నీరజ్.. పంజాబీ పాటకు స్టెప్పులేసి ఇరగదీశాడు.  

రాఘవ, శక్తి మోహన్ మధ్య చాలాకాలంగా ఎఫైర్ ఉన్నట్టు ఈ షో ఫాలో వారికెవరికైనా తెలుస్తుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి పలు షోలు చేశారు. అంతేగాక డాన్స్ ప్లస్ 6 లో ఒకరితో ఒకరు సరసాలాడుకోవడం.. వీకెండ్స్ పార్టీల్లో కనిపించడం, ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలలో పంచుకోవడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios