ఇంటికే: రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు

Rohit Sharma Ends Tournament With An Unwanted Record
Highlights

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ను మాత్రమే కాదు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను కూడా ఈ ఐపిఎల్ సీజన్ లో దురదృష్టం వెంటాడింది. 

ముంబై: డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ను మాత్రమే కాదు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను కూడా ఈ ఐపిఎల్ సీజన్ లో దురదృష్టం వెంటాడింది.  మూడు సార్లు ఐపిఎల్ ట్రోఫీని దక్కించుకున్న ముంబై ఇండియన్స్ ఈసారి పూర్తిగా చతికిలపడింది. 

ప్లేఆఫ్‌ కు కూడా వెళ్లలేని స్థితికి దిగజారింది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్‌ శర్మ పరమ చెత్త రికార్డును సృష్టించాడు. రోహిత్‌ ఈ సీజన్‌లో పరుగులు పిండుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. 

లీగ్ దశలో 14 మ్యాచ్‌ లు ఆడిన రోహిత్ కేవలం 286 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్‌ చరిత్రలో రోహిత్‌ శర్మ ఒక సీజన్‌లో 300లోపు పరుగులు చేయడం ఇదే తొలిసారి.

రోహిత్ శర్మ 2013 టోర్నీలో అద్భుతమైన ఫామ్ కనబరిచి 19 మ్యాచుల్లో 538 పరుగులు చేశాడు. ఐపిఎల్ 11 ఎడిషన్స్ లో అతను ఐదు సార్లు 400 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. 2008లో జరిగిన తొలి ఐపిఎల్ టోర్నీలో 13 మ్యాచులు ఆడి 404 పరుగులు చేశాడు.

రోహిత్ శర్మ 2009 ఐపిఎల్ టోర్నీలో 362 పరుగులు, 2010 ఐపిఎల్ టోర్నీలో 404 పరుగులు, ఐపిఎల్ 2011లో 372 పరుగులు, 2012 ఐపిఎల్ లో 433 పరుగులు, 2013 ఐపిఎల్ టోర్నీలో 538 పరుగులు, 2014 ఐపిఎల్ లో 390 పరుగులు, 2015 ఐపిఎల్ లో 482 పరుగులు, 2016 ఐపిఎల్ ట్రోనీలో 489 పరుగులు, 2017 ఐపిఎల్ టోర్నీలో 333 పరుగులు చేశాడు. 

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి ముంబై ఇండియన్స్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

loader