నేను ఆ స్థితిలో లేను: జట్టులో చోటుపై రోహిత్ శర్మ

First Published 30, May 2018, 4:14 PM IST
No Point Thinking About Test Cricket at This Stage of Career, Says Rohit Sharm
Highlights

జట్టులో అవకాశం లభిస్తుందా లేదా అని నిరీక్షించే స్థితిలో తాను లేనని, ఇప్పుడు కేవలం క్రికెట్‌ ఆస్వాదించడమే తన పని భారత క్రికెటర్ రోహిత్‌శర్మ అన్నారు.

ముంబై: జట్టులో అవకాశం లభిస్తుందా లేదా అని నిరీక్షించే స్థితిలో తాను లేనని, ఇప్పుడు కేవలం క్రికెట్‌ ఆస్వాదించడమే తన పని భారత క్రికెటర్ రోహిత్‌శర్మ అన్నారు. పరిమిత ఓవర్ల మ్యాచుల్లో చెలరేగే రోహిత్‌ టెస్టుల్లో తడబాటుకు గురవుతున్న విషయం తెలిసిందే. 

గత దక్షిణాఫ్రికా సిరీస్‌లో అతను ఘోరంగా విఫలమయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు కూడా సెలక్టర్లు రోహిత్‌ను తీసుకోలేదు.

ప్రస్తుతం సెలక్షన్‌ గురించే ఆలోచించే స్థితిలో లేనని, ఇప్పటికే సగం కెరీర్‌ను పూర్తి చేసుకున్నానని రోహిత్ శర్మ అన్నారు. మిగతా కెరీర్‌ను ఆస్వాదించాలనుకుంటున్నానని చెప్పారు. కెరీర్‌ ప్రారంభంలో జట్టులో స్థానం కోసం ఆరాటపడేవాడినని అన్నారు. జట్టులో చోటు దక్కిందా? మ్యాచ్‌లో ఆడుతానా లేదా అని ఆరాటపడేవాడినని అన్నారు. 

ఆ సమయంలో దిగ్గజాలు సచిన్‌, ద్రవిడ్‌, లక్ష్మణ్‌లు ఉండేవారని దీంతో చోటుకోసం ఎదురుచూడాల్సి వచ్చేదని అన్నారు. సెలక్షన్‌ గురించి ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుందని గ్రహించినట్లు తెలిపారు. అఫ్గాన్‌ టెస్టుకు ఎంపి కాకపోవడంపై అశ్చర్యపడలేదని, భవిష్యత్తు టోర్నీల కోసమే విశ్రాంతి కల్పించుంటారని భావిస్తున్నానని అన్నారు.

loader