టెస్టు జట్టులో దక్కని చోటు: రోహిత్ శర్మ ఉద్వేగభరిత ట్వీట్

India vs England: Rohit Sharma Emotional Message
Highlights

టెస్టు జట్టులో రోహిత్ జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయాడు. అయితే దీనిపై రోహిత్ శర్మ ఉద్వేగభరితమైన వ్యాఖ్య చేశాడు. 

ముంబై: ఇంగ్లాండుతో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి మూడు టెస్టులకు ఎంపికైన జట్టులో రోహిత్ శర్మకు చోటు దక్కని విషయం తెలిసిందే. జట్టుకు ఎంపికైన 18 సభ్యుల జాబితాలో అతని పేరు లేదు. 

 ట్వంటీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో, వన్డే సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో సెంచరీలు చేసి జట్టుకు రోహిత్ శర్మ విజయాన్ని అందించాడు.  అయినా కూడా టెస్టు జట్టులో రోహిత్ జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయాడు. అయితే దీనిపై రోహిత్ శర్మ ఉద్వేగభరితమైన వ్యాఖ్య చేశాడు. 

ట్విట్టర్ వేదికగా "సూర్యుడు రేపు మళ్లీ ఉదయిస్తాడు" అని కవితాత్మకంగా వ్యాఖ్యానించాడు. అతని వ్యాఖ్యలో ఆశావహ దృక్పథం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
 
దక్షిణాఫ్రికాతో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రోహిత్ ఆడాడు. అయితే నాలుగు ఇన్నింగ్స్‌లో అతను కేవలం 19.50 సగటుతో 78 పరుగులు చేశారు. దీంతో మూడో టెస్ట్‌‌లో అతన్ని జట్టు నుంచి తప్పించారు. 

ఆ తర్వాత బెంగళూరు వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో కూడా రోహిత్ శర్మకు స్థానం కల్పించలేదు. ప్రస్తుత స్థితితో రోహిత్ శర్మకు టెస్టు జట్టులోకి ప్రవేశం అంత సులభం కాదనిపిస్తోంది.

loader