Asianet News TeluguAsianet News Telugu

రెండో టీ20: విండీస్ చిత్తు, సిరీస్ భారత్ వశం

రెండో ట్వంటీ20 మ్యాచులో ఆతిథేయ జట్టు వెస్టిండీస్ అతిథ్య జట్టు భారత్ పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్టులో భారత్ ఒక మార్పు చేసింది. ఉమేష్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్ జట్టులోకి వచ్చాడు.

2nd t20: India vs India updates
Author
Lucknow, First Published Nov 6, 2018, 7:14 PM IST

లక్నో:  భారత్ పై వెస్టిండీస్ రెండో ట్వంటీ20 మ్యాచులో చిత్తుగా ఓడిపోయింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాట్స్ మెన్ నిలదొక్కుకోలేకపోయారు. భారత్ 71 పరుగుల భారీ తేడాతో విండీస్ పై ఘన విజయం సాధించింది. భారత్ తమ ముందు ఉంచిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 9 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగుల మాత్రమే చేసింది. మూడు మ్యాచులో సిరీస్ లో వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించి భారత్ సిరీస్ ను కూడా వశం చేసుకుంది. భారత బౌలర్లలో ఖలీల్ ఆహ్మద్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. 

భారత్ వెస్టిండీస్ 81 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. రామ్ దిన్ భువనేశ్వర్ కుమార్ బౌలింగులో అవుటయ్యాడదు. ఆ తర్వాత వెంటనే అదో స్కోరు వద్ద అలెన్ రన్నవుట్ గా వెనుదిరిగాడు. దీంతో విండీస్ 81 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. 114 పరుగుల వద్ద విండీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. పాల్ భువనేశ్వర్ కుమార్ బౌలింగులో అవుటయ్యాడు. 116 పరుగుల వద్ద విండీస్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. పీరే బుమ్రా బౌలింగ్ లో కాట్ అండ్ బౌల్డ్ గా వెనుదిరిగాడు.

రెండో ట్వంటీ20 మ్యాచులో వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. 68 పరుగులకే విండీస్ ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. హెట్ మియర్ ను ఖలీల్ అహ్మద్ 15 పరుగులకే ఔట్ చేశాడు. బ్రేవో 23 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగులో అవుటయ్యాడు.పురాన్ (4 పరుగులు) వికెట్ ను కూడా కుల్దీప్ యాదవ్ తీశాడు. పోలార్డ్ 6 పరుగులు చేసి బుమ్రాకు దొరికిపోయాడు.

భారత్ తమ ముందు ఉంచిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఏడు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. హోప్ ఆరు పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగులో అవుటయ్యాడు. 

వెస్టిండీస్ పై జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచులో భారత్ రెండు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. విండీస్ ముందు 196 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ 61 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్స్ ల సాయంతో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లోకేష్ రాహుల్ 14 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

అంతకు ముందు భారత్ 133 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ తొలి వికెట్ గా 123 పరుగుల వద్ద ఔటయ్యాడు. అతను 43 పరుగులు చేసి అలెన్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు. రిషబ్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం ఆరు పరుగులకే పంత్ చేతులెత్తేశాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 58 బంతుల్లో సెంచరీ చేశాడు. ట్వంటీ20లో రోహిత్ కు ఇది నాలుగో సెంచరీ.

రెండో ట్వంటీ20 మ్యాచులో ఆతిథేయ జట్టు వెస్టిండీస్ అతిథ్య జట్టు భారత్ పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్టులో భారత్ ఒక మార్పు చేసింది. ఉమేష్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్ జట్టులోకి వచ్చాడు.భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ బ్యాటింగ్ కు దిగారు. రెండు ఓవర్లు ముగిసే సరికి భారత్ 7 పరుగులు చేసింది.  మూడు మ్యాచులో టీ20 సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచును భారత్ గెలుచుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios