Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup: కీలక పోరులో రెచ్చిపోయి ఆడిన బంగ్లా పులులు.. మహ్మదుల్లా కెప్టెన్ ఇన్నింగ్స్..

T20 World Cup: ఓమన్ లోని అల్ అమెరట్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న్ బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.

ICC T20 World Cup2021: bangladesh set huge target against papua new guinea
Author
Hyderabad, First Published Oct 21, 2021, 5:27 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో భాగంగా గ్రూప్-బీ లో రెండో బెర్త్ కోసం పోటీ పడుతున్న బంగ్లాదేశ్ (Bangladesh).. పపువా న్యూ గినియా (Papua new guinea) తో తలపడుతున్నది. ఓమన్ లోని అల్ అమెరట్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న్ బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. బంగ్లా జట్టులో కెప్టెన్ మహ్మదుల్లా (Mahmudullah), షకిబ్ అల్ హసన్ (shakib al hasan), లిటన్ దాస్ (liton das) లు రాణించారు. 

టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ గత మ్యాచ్ లో హాఫ్  సెంచరీతో అదరగొట్టిన మహ్మద్ నయీమ్ (0).. రెండో బంతికే డకౌట్ అయ్యాడు.  మరో ఓపెనర్ లిటన్ దాస్ (23 బంతుల్లో 29) తో కలిసి వన్ డౌన్ లో వచ్చిన షకిబ్ అల్ హసన్ (37 బంతుల్లో 46) ఆదుకున్నాడు. 

ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.  సాఫీగా సాగుతున్న ఈ జోడీని పీఎన్జీ కెప్టెన్ అసద్ (Asad wala)విడదీశాడు.  అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ముష్ఫకర్ రహీమ్ (5) పరుగులకే వెనుదిరిగాడు. 

 

72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్ ను మహ్మదుల్లా (28 బంతుల్లో 50) ఆదుకున్నాడు.  క్రీజులోకి  రావడంతోనే బాదుడు మొదలుపెట్టిన మహ్మదుల్లా.. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. ఆఖర్లో అఫిఫ్ హుస్సేన్ (14 బంతుల్లో 21), మహ్మద్ సైఫుద్దీన్ (6 బంతుల్లో 2 సిక్సర్లు, ఒక ఫోర్ తో 19 నాటౌట్) రెచ్చిపోయి ఆడారు. మిడిల్ ఓవర్లలో వీరబాదుడుతో పాటు ఫైనల్ ఓవర్లలో రెచ్చిపోవడంతో బంగ్లా.. పీఎన్జీ ముందు 182  పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

 

పపువా న్యూ గినియా బౌలర్లలో మోరియా తప్ప అందరూ  తేలిపోయారు. నాలుగు ఓవర్లు వేసిన మోరియా.. 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. డేమియన్ 2 వికెట్లు తీసిన భారీగా పరుగులిచ్చుకున్నాడు. అసద్ , సిమోన్  తలో వికెట్ దక్కించుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios