తాను శ్రీశాంత్‌ను కొట్టడం తప్పేనని ఒప్పకున్నాడు టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. అప్పటి ఘటన పట్ల తాను ఇప్పటికీ బాధపడుతుంటానని పేర్కొన్నాడు. శ్రీశాంత్‌తో అప్పుడు ముంబైలో జరిగిన సంఘటన గురించి క్రికెట్ అభిమానులు ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు.

ఒకవేళ తనకు జీవితంలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే శ్రీశాంత్‌ను చెంప దెబ్బ కొట్టిన సన్నివేశాన్ని మార్చుకుంటానని భజ్జీ తెలిపాడు. తాను అలా చేసుండాల్సింది కాదని, తాను తప్పు చేశానని చెప్పాడు. శ్రీశాంత్ అద్భుతమైన ఆటగాడు, అతడికి ఎంతో నైపుణ్యం ఉంది.

అతను, అతని సతీమణి, పిల్లలకు నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. ఎవరేమనుకున్నా నాకు అనవసరమని, అతను తన సోదరుడని హర్భజన్ వెల్లడించాడు. ఐపీఎల్ మొదటి సీజన్‌లో భజ్జీ ముంబై ఇండియన్స్ తరపున ఆడగా, శ్రీశాంత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ప్రాతినిధ్యం వహించారు.

ఈ క్రమంలో రెండు జట్ల మధ్య ముంబైలో జరిగిన మ్యాచ్‌లో భజ్జీ హఠాత్తుగా శ్రీశాంత్ చెంపై కొట్టాడు.. దీంతో భావోద్వేగానికి గురైన శ్రీ మైదానంలోనే కంటతడి పెట్టడం క్రికెట్ అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన హర్భజన్ అతడిని క్షమాపణ కోరాడు.

న్యూజిల్యాండ్ పర్యటనకు కోహ్లీతో పాటే అనుష్క...అభిమానుల సెటైర్లు (వీడియో)

న్యూజిలాండ్‌‌ను ఓడించడం కోహ్లీసేనకు కష్టమే:టీంఇండియా మాజీ క్రికెటర్

ధోనికి ఐసిసి అరుదైన గౌరవం...

చావు బతుకుల్లో టీమిండియా మాజీ క్రికెటర్.. సాయం కోసం ఎదురుచూపులు

ఆల్ టైమ్ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ కోహ్లీ.. క్లార్క్