మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టీ20లో కివీస్ చేతిలో టీమిండియా ఓడిపోవడంపై తనదైన శైలిలో స్పందించాడు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. ఇప్పుడున్న పరిస్థితిలో టీమిండియాకు ఓటమి, గెలుపు రెండు అనుభవాలు కావాలి.. రానున్నది ప్రపంచకప్ సమరం. ఇంతటి ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ గెలవాలంటే కొన్ని సవాల్లు ఎదురవ్వాలన్నాడు..

న్యూజిలాండ్ జట్టు సత్తా ఏంటో ఈ టీ20 ద్వారా టీమిండియాకు అర్థమై ఉంటుంది, కాబట్టి ప్రపంచకప్‌లో ఆ జట్టుతో అప్రమత్తంగా ఉంటుందని సన్నీ వ్యాఖ్యానించారు. వన్డేల్లో ఎలాంటి ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాలో ఇలాంటి మ్యాచ్‌లే తేలుస్తాయని సునీల్ అభిప్రాయపడ్డాడు.

భారత్ ఇప్పటికే వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో వన్డే సిరీస్‌లు ఆడిందన్నాడు. ప్రస్తుత సిరీస్ విషయానికి వస్తే భారత్ ఒక్క మ్యాచే కాదు మొత్తం సిరీస్‌ను కోల్పోయినా తాను బాధపడనని, జట్టు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటుందని భావిస్తానని గావాస్కర్ వెల్లడించాడు. కొత్త కుర్రాళ్లు రిషభ్ పంత్, విజయ్ శంకర్, కృనాల్ పాండ్యా వంటి వారికి ఈ సిరీస్‌తో పాటు రాబోయే మ్యాచ్‌ల్లో అవకాశం ఇవ్వాలని ఆయన సూచించాడు.

వరల్డ్‌కప్‌పై ఐపిఎల్ ప్రభావం పడకుండా కీలక నిర్ణయం: రవిశాస్త్రి

నా భీకర ఆటకు స్పూర్తి నువ్వే: స్మృతీ ఆన్సర్‌కు షాకైన చాహల్

కార్తీక్ స్టన్నింగ్ క్యాచ్ చూశారా..?

భారత్ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు